దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం జులై నెలలో సాధారణంగానే ఉండొచ్చని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. సగటున 94 నుంచి 106 శాతం వర్షం కురుస్తుందని అంచనా వేసింది.
జులై నెలలో తొలి వారం అంతగా వర్షాలు కురిసే అవకాశం లేదని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర పేర్కొన్నారు. రెండో వారం మధ్యలో వర్షాలు పుంజుకుంటాయని తెలిపారు.
అక్కడ వడగాలులే!
మరోవైపు, ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు ఇప్పుడే తగ్గుముఖం పట్టే అవకాశాలు లేవని ఐఎండీ తెలిపింది. పంజాబ్, హరియాణా, దిల్లీ, ఉత్తర రాజస్థాన్, ఉత్తర్ప్రదేశ్లో వచ్చే రెండు రోజుల పాటు వేడిగాలులు కొనసాగుతాయని అంచనా వేసింది. గత కొద్ది రోజుల్లో ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటాయని తెలిపింది. జమ్ములోని పలు ప్రాంతాల్లో బుధవారం తీవ్ర వేడి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఇదీ చదవండి: '121ఏళ్లలో రెండో అత్యధిక వర్షపాతం'