దేశంలో కరోనా విజృంభిస్తున్న క్రమంలో.. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ చేయాలని భారతీయ వైద్య సంస్థ (ఐఎంఏ).. ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.
"ప్రస్తుతం 45 ఏళ్ల పైబడిన వారికి టీకా అందిస్తున్నారు. కేసులు అధికమవుతున్న క్రమంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. 18ఏళ్ల పైబడిన వారందరికీ టీకా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలి."
-- భారతీయ వైద్య సంస్థ(ఐఎంఏ)
కరోనాను కట్టడి చేసేందుకు వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో తాత్కాలిక లాక్డౌన్ విధించాలని సూచించింది. ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచటం, ఆక్సిజన్ సరఫరా.. తదితర అంశాలపై దృష్టి సారించాలని లేఖలో తెలిపింది.
ఇదీ చదవండి : కరోనా విజృంభణ- దిల్లీలో రాత్రి కర్ఫ్యూ