వైద్యులపై దాడులను నిరసిస్తూ జూన్ 18న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు భారత వైద్య సంఘం(IMA) తెలిపింది. నల్ల బ్యాడ్జీలు, మాస్కులు ధరించి నిరసన తెలపాలని దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక కార్యాలయాలకు పిలుపునిచ్చింది. రక్షకులను కాపాడండి (సేవ్ ది సేవియర్స్) అనే నినాదంతో ఆందోళన చేయనున్నట్లు పేర్కొంది.
సెంట్రల్ ఆస్పిటల్ అండ్ హెల్త్ కేర్ ఫ్రొఫెషనల్స్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలని, ప్రతి ఆస్పత్రిలో భద్రత పెంచాలని డిమాండ్ చేశారు వైద్యులు. జూన్ 15వ తేదీని జాతీయ డిమాండ్ డే గా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : Third wave: 'కరోనా మూడో దశ అనివార్యం'