ETV Bharat / bharat

చమురును వెలికితీసే సింథటిక్ అణువులు

చమురును వెలికితీసేందుకు దేశీయ పరిజ్ఞానంతో సింథటిక్ అణువులను రూపొందించారు ఐఐటీ-ఖరగ్​పుర్ పరిశోధకులు. స్పెషాలిటీ ఫ్రిక్షన్ రెడ్యూసర్ పాలిమర్ల ఆప్టిమైజేషన్ కోసం ఆటోమేటిక్ ఫ్లోలూప్​ను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసింది.

author img

By

Published : Jul 29, 2021, 9:01 AM IST

oil extraction
చమురు

భూగర్భ బావుల నుంచి చమురు, వాయువులను వెలికితీసేందుకు దోహదపడే భారీ సింథటిక్ అణువులను ఐఐటీ- ఖరగ్​పుర్​ పరిశోధకులు రూపొందించారు. ఇవి స్పెషాలిటీ ఫ్రిక్షన్- రెడ్యూసర్ పాలిమర్లకు సంబంధించినవి.

ఫ్రాకింగ్ పద్దతి..

ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా భూగర్భ బావుల నుంచి చమురు, వాయువులను వెలికితీసేందుకు ఫ్రాకింగ్ తదితర నూతన విధానాలను అనుసరిస్తున్నారు. భూగర్భ పగుళ్లలోకి ద్రావణాన్ని అధిక పీడనంలోకి చొప్పించి, అక్కడి నుంచి చమురు, వాయువులను సంగ్రహించటమే ఫ్రాకింగ్. ఇందుకు స్పెషాలిటీ ఫ్రిక్షన్​- రెడ్యూసర్​ పాలిమర్లు దోహదపడతాయి. ప్రపంచవ్యాప్తంగా వీటికి తీవ్ర డిమాండ్​ నెలకొన్నా, ఈ సాంకేతికత అందుబాటులో లేని కారణంగా భారత్ ఈ పాలిమర్ల ఉత్పత్తి, సరఫరా చేపట్టలేకపోతోంది. దీనిపై దృష్టి సారించిన ప్రొఫెసర్ సందీప్ కులకర్ణి బృందం.. సింథటిక్​ అణువులను సృష్టించింది.

దేశీయ పరిజ్ఞానంతో..

స్పెషాలిటీ ఫ్రిక్షన్ రెడ్యూసర్ పాలిమర్ల ఆప్టిమైజేషన్ కోసం ఆటోమేటిక్ ఫ్లోలూప్​ను పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో రూపొందించింది. వీటితో భూగర్భ బావుల నుంచి చమురు, వాయువులను సమర్థంగా వెలికితీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. భారత్​లో తయారీ కార్యక్రమం కింద దీన్ని మరింత మెరుగుపరిచి, స్పెషాలిటీ ఉత్పత్తుల రంగంలో ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించేందుకు కృషి చేస్తామని ఈ ప్రాజెక్టు స్పన్సర్ డా. డెసార్కర్ చెప్పారు.

ఇదీ చదవండి: మీ సొమ్ముకు మరింత భద్రత- బ్యాంకు దివాలా తీసినా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.