అసోం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్(ఉల్ఫా)కు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం నుంచి ఓ లేఖ అందింది. అసోం ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఉల్ఫా సానుకూలంగా స్పందించడంపై ఐహెచ్ఆర్సీ హర్షం వ్యక్తం చేసింది. ఈ విషయంలో మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అయితే.. ఈ లేఖపై ఉల్ఫా సంస్థ కమాండర్ ఇన్ చీఫ్ పరేశ్ బారువా అనుమానం వ్యక్తం చేశారు.
"ఈ లేఖపై మాకు చాలా అనుమానాలున్నాయి. ఐరాసకు సంబంధించిన మానవ హక్కుల సంఘం నుంచి లేఖ వస్తే.. అది జెనీవా నుంచి రావాలి. కానీ, ఇది ముంబయి అడ్రెస్ నుంచి వచ్చింది" అని పరేశ్ ఈటీవీ భారత్ సీనియర్ రిపోర్టర్ గౌతమ్ బారువాతో చెప్పారు. ఆదివారం గౌతమ్‌తో ఫోన్లో మాట్లాడారు.
ప్రభుత్వంతో చర్చలపై స్పందించిన పరేశ్.. అసోం సర్కారు నుంచి ఇప్పటివరకు లేఖ రాలేదని పేర్కొన్నారు. నూతన సీఎం హిమంత బిశ్వ శర్మ.. ప్రమాణస్వీకారం చేపట్టిన వెంటనే ఉల్ఫాతో చర్చలకు పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ఐహెచ్ఆర్సీ లేఖపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.