ETV Bharat / bharat

Vaccine: 'ఉచితం అంటూ.. వసూళ్లు ఏంటి?' - ఉచితం వ్యాక్సిన్​

టీకా ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రధాని ప్రకటించిన తరువాత కూడా వ్యాక్సిన్​ వేసేందుకు ప్రైవేట్​ ఆసుపత్రులు డబ్బులు వసూళ్లు చేయడంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మండిపడ్డారు. అందరికీ ఉచితంగా వ్సాక్సిన్​ అందించాలని డిమాండ్​ చేశారు.

rahul gandi
రాహుల్​
author img

By

Published : Jun 7, 2021, 11:09 PM IST

టీకాలు వయోజనులందరికీ ఉచితంగా ఇస్తామని ప్రకటించిన తరువాత కూడా ప్రైవేట్​ ఆసుపత్రులు డబ్బులు వసూలు చేయడమేంటని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ప్రశ్నించారు. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్​ ఉచితంగా ఇవ్వాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

కేంద్రం టీకా పంపిణీ విధానంలో తన పంథాను మార్చుకోవడానికి సుప్రీంకోర్టే కారణమని కాంగ్రెస్ పేర్కొంది. ఉచిత టీకాకు సంబంధించిన క్రెడిట్ మొత్తం దేశ అత్యున్నత న్యాయస్థానానికే ఇవ్వాలన్నారు. కేంద్రాన్ని సుప్రీం మందలించి, టీకా పంపిణీపై అఫిడవిట్ కోరిన తరువాతే మోదీ ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు.

ఈ నిర్ణయం ఎప్పుడో తీసుకోవాల్సింది..

18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్​ అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై బంగాల్​ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం కొన్ని నెలల ముందే తీసుకోవాల్సిందని అన్నారు. కేంద్ర నిర్ణయంలో ఆలస్యం కారణంగా ఎంతో మంది జీవితాలు బలైపోయాయని ఆరోపించారు.

'ఫిబ్రవరి 21కి ముందు ఉచితంగా వ్యాక్సిన్​ ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరాం. కానీ ఆయన అప్పుడు మాట వినలేదు. ఈ నిర్ణయం తీసుకునేందుకు మోదీకి నాలుగు నెలల సమయం పట్టింది. ఈ ఆలస్యం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని ఇప్పుడైనా ప్రచారంపై కాకుండా, ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలి' అని మమత పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మోదీ ప్రసంగం- టాప్​ టెన్​ హైలైట్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.