ETV Bharat / bharat

'సాగు చట్టాలను ఎందుకు రద్దు చేయలేరు?' - black day for farmers

రైతుల బ్లాక్​ డే సందర్భంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు బీకేయూ నేత రాకేశ్​ టికాయిత్​. మహమ్మారి సమయంలో కూడా చట్టాలను ప్రవేశపెడుతున్నప్పుడు.. చట్టాలను ఎందుకు రద్దు చేయలేరని ప్రశ్నించారు. కొత్త సాగు చట్టాలు రద్దు అయ్యే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

రైతు నేత రాకేశ్​ టికాయిత్, black day for farmers
సాగు చట్టాలను ఎందుకు రద్దు చేయరు? : రాకేశ్​ టికాయిత్​
author img

By

Published : May 26, 2021, 10:39 PM IST

Updated : May 26, 2021, 10:46 PM IST

మహమ్మారి సమయంలో చట్టాలను ప్రవేశపెడుతున్నప్పుడు.. సాగు చట్టాలను ఎందుకు రద్దు చేయలేరని కేంద్రాన్ని ప్రశ్నించారు రైతు సంఘం నేత రాకేశ్​ టికాయిత్​. ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని, భవిష్యత్తులో కూడా ప్రయత్నిస్తుందని ఆరోపించారు. అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు నిరసన విరమించమని ఉద్ఘాటించారు. ఈ ఉద్యమం విజయవంతం అయితే భవిష్యత్తు తరాల రైతులకు కూడా మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాగు చట్టాల నిరసనలు ఆరు నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బుధవారం గాజియాబాద్​లో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టికాయిత్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

'ప్రభుత్వ ప్రాధాన్యం రైతులకే'

మోదీ ప్రభుత్వం రైతులకే ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్. కొన్ని రాజకీయ పార్టీలే రైతులను తప్పుదొవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్​ హయాంలో సంస్కరణల పేరుతో ప్రతిపాదించిన చట్టాలనే ఇప్పుడు ఆ పార్టీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఆ పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : బ్లాక్​ డే: '6 నెలలైనా కేంద్రం మమ్మల్ని పట్టించుకోవట్లేదు'

Last Updated : May 26, 2021, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.