ETV Bharat / bharat

కెనడా నుంచి భారత్​కు 'అన్నపూర్ణ దేవి' విగ్రహం - వారణాసి

100 ఏళ్ల క్రితం దొంగతనానికి గురై.. కెనడా ప్రభుత్వ అధీనంలో ఉన్న మాతా అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని కేంద్ర ప్రభుత్వం భారత్​కు రప్పించింది. ప్రత్యేక పూజల అనంతరం ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వానికి అప్పగించారు కేంద్ర మంత్రులు. ఈనెల 15న వారణాసి చేరుకోనుంది.

Goddess Annapurna
అన్నపూర్ణ దేవికి ప్రత్యేక పూజలు
author img

By

Published : Nov 11, 2021, 1:34 PM IST

Updated : Nov 11, 2021, 2:11 PM IST

భారత్​కు 'అన్నపూర్ణ దేవి' విగ్రహం

ఉత్తర్​ప్రదేశ్​లోని వారణాసి నుంచి 100 ఏళ్ల క్రితం చోరీకి గురై.. కెనడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మాతా అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని భారత్​కు రప్పించింది కేంద్రం. అమ్మవారి విగ్రహాన్ని ఈనెల 15న వారణాసిలోని కాశీ విశ్వనాథుడి​ ఆలయంలో ప్రతిష్టించనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్​ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ విగ్రహం 17 సెంటీమీటర్ల ఎత్తు, 9 సెంటీమీటర్ల వెడల్పు, 4 సెంటీమీటర్ల మందంతో ఉంటుంది.

Goddess Annapurna
అన్నపూర్ణ దేవికి ప్రత్యేక పూజలు

విగ్రహాన్ని ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వానికి బుధవారం అప్పగించింది కేంద్రం. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు కిషన్​ రెడ్డి, స్మృతి ఇరానీ, మీనాక్షీ లేఖీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Goddess Annapurna
అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు

కెనడా ప్రభుత్వంతో కొన్ని సంవత్సరాలుగా సంప్రదింపులు జరిపి.. విగ్రహాన్ని భారత్​కు చేర్చినట్లు కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్​ రెడ్డి తెలిపారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నుంచి ఇప్పటి వరకు 42 అరుదైన వారసత్వ కళాకృతులను భారత్​కు తీసుకొచ్చినట్లు చెప్పారు. విదేశాల్లో 175 విగ్రహాలు, చిహ్నాలు, చిత్రపటాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. సింగపూర్​, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్​, బెల్జియం వంటి దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. మన సంస్కృతికి నెలవైన విగ్రహాలను తిరిగి మన వద్దకు చేర్చిన మోదీకి దేశ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. 18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని తిరిగి తమ వద్దకు చేర్చడంపై ఉత్తర్​ప్రదేశ్​ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Goddess Annapurna
అమ్మవారిని తీసుకెళ్లేందుకు సిద్ధం చేసిన ప్రత్యేక రథం

వారణాసికి అమ్మవారు..

కేంద్ర మంత్రుల ప్రత్యేక పూజల అనంతరం యూపీ ప్రభుత్వానికి అమ్మవారి విగ్రహాన్ని అప్పగించారు. ప్రత్యేకంగా రూపొందించిన రథంలో విగ్రహాన్ని కాశీ విశ్వనాథుడి​ ఆలయానికి తీసుకెళుతున్నారు అధికారులు. ముందుగా దిల్లీ నుంచి ఆగ్రా మీదుగా నవంబర్​ 12న కన్నౌజ్​ చేరుకోనుంది రథం. 14న అయోధ్యకు.. అక్కడి నుంచి 15న వారణాసి చేరుకుంటుంది.

ఇదీ చూడండి: 400 ఏళ్లనాటి వినాయక విగ్రహం స్వాధీనం

Last Updated : Nov 11, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.