ETV Bharat / bharat

'కొవిడ్ రోగుల్లో మరణాలకు కారణమిదే..!'

కొవిడ్ రెండో దశ వ్యాప్తిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై అధ్యయనం చేసిన భారత వైద్య పరిశోధనా మండలి కీలక విషయాలు వెల్లడించింది. సెకండరీ ఇన్​ఫెక్షన్ల వల్లే అధిక మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది.

ICMR study
ఐసీఎంఆర్, వైద్య మండలి
author img

By

Published : May 28, 2021, 10:14 PM IST

కొవిడ్​ రోగుల్లో ఇతర వ్యాధులు సంక్రమించడం వల్లే వైరస్​ రెండో ఉద్ధృతి సమయంలో అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయినట్లు భారత వైద్య పరిశోధనా మండలి పేర్కొంది. సెకండ్​ వేవ్​ సమయంలో మరణాల పెరుగుదలపై అధ్యయనం చేసినట్లు తెలిపింది.

ఆసుపత్రుల్లో చేరిన మొత్తం కొవిడ్ బాధితుల్లో 10.6 శాతం మంది మృతిచెందగా.. కొవిడ్​తో పాటు ఇతర వ్యాధులకు గురైన వారిలో మృతుల సంఖ్య 56.7 శాతంగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని 10 ఆసుపత్రుల్లో అధ్యయనం చేసి ఈ నిర్ధరణకు వచ్చారు నిపుణులు. డాక్టర్ కామిని వాలియా ఈ సర్వే చేశారు. బాధితుల్లో సగానికి పైగా ఇతర వ్యాధులతో మృతిచెందిన వారే అని స్పష్టం చేశారు. మ్యూకోర్​మైకోసిస్​ బాధితులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.

17,534 రోగులపై అధ్యయనం చేయగా 3.6 శాతం మంది అందులో ఇతర ఫంగల్​ ఇన్​ఫెక్షన్లకు గురయ్యారని అధ్యయనంలో తెలిసింది. ఇందులో మరణించిన వారి సంఖ్య 56.7 శాతం కావడం గమనార్హం. రక్తం ద్వారా, శ్వాసకోశ అవయవాల ద్వారా ఇన్​ఫెక్షన్లు ఎక్కువగా వచ్చినట్లు స్పష్టమైంది.

వైద్యులు పీపీఈ కిట్​, గ్లోవ్స్​ ధరించిన కారణంగానూ చేయి పరిశుభ్రతపై ప్రభావం చూపినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.

ఇదీ చదవండి:కరోనా రోగిని మోస్తూ 7 కి.మీల నడక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.