ETV Bharat / bharat

12 ఆరోగ్య చిట్కాలతో ICMR న్యూ ఇయర్‌ 'స్పెషల్' విషెస్.. అవేంటంటే? - 12 చిట్కాలతో ఐసీఎంఆర్‌ ఎన్‌ఐఎన్‌ గ్రీటింగ్‌ షేర్‌

ఎన్నో ఆశలు, లక్ష్యాలతో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికీ శుభాలే జరగాలంటూ విషెస్ తెలిపాం. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో ఆరోగ్యమయ జీవితాన్ని కొనసాగించేలా 12 చిట్కాలతో ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌ సంయుక్తంగా షేర్‌ చేసిన గ్రీటింగ్‌ ఆకట్టుకుంటోంది. మరి ఆ ఆరోగ్య సూత్రాలేంటో తెలుసుకుందాం రండి..

icmr-nin-happy-new-year-wishes-card
12 ఆరోగ్య చిట్కాలతో ఐసీఎంఆర్‌ న్యూ ఇయర్‌ విషెష్‌
author img

By

Published : Jan 1, 2023, 8:15 PM IST

Updated : Jan 2, 2023, 6:41 AM IST

2022కి వీడ్కోలు పలికి మరో కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలికాం. ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ప్రతి ఒక్కరికీ శుభాలే కలగాలంటూ ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకొంటున్నాం. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో ఆరోగ్యమయ జీవితాన్ని కొనసాగించేలా 12 చిట్కాలతో ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌ సంయుక్తంగా షేర్‌ చేసిన గ్రీటింగ్‌ ఆకట్టుకుంటోంది. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం ప్రాముఖ్యతతో హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ 12 అక్షరాలలో 12 ఆరోగ్య సూత్రాలు.

  • ప్రతిరోజూ తగిన మోతాదులో పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
  • అధిక కొవ్వులు, చక్కెర, ఉప్పుతో ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.
  • రోజులో కనీసం 30 నిమిషాలైనా శారీరక శ్రమ చేసేలా ప్రాక్టీస్‌ చేయండి.
  • పండ్ల రసాలకు బదులు తాజా పండ్లను తినండి. రిఫైన్డ్‌, పాలిష్‌ చేసిన ధాన్యాలకు బదులు తృణధాన్యాలు ఆరోగ్యానికి మంచివి.
  • ప్రాసెస్‌ చేసిన ఫుడ్‌లకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది.
  • నిద్రకు సంబంధించిన నాణ్యతలో గానీ, సమయంలో గానీ ఎట్టిపరిస్థితుల్లో రాజీపడొద్దు.
  • రోజులో కచ్చితంగా 2-3లీటర్ల నీరు తాగండి.
  • ఆహారం తీసుకొనే ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు కడుక్కోండి.
  • ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోండి. పొగాకు, మద్యం వాడకానికి దూరంగా ఉండండి.
  • వైవిధ్యమైన డైట్‌ పాటించండి. అన్ని పోషకాలూ ఒకే ఆహారంలో లభించవని గుర్తుపెట్టుకోండి.
  • ఆహార నియమాలకు కట్టుబడి ఉండండి.
  • ఆహార పదార్థాలపై ఉన్న లేబుల్స్‌ను సరిగా చదవండి. మీరు తినాల్సిన ఆహారాన్ని తెలివిగా ఎంచుకోండి.

ఇవీ చదవండి:

Last Updated : Jan 2, 2023, 6:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.