ETV Bharat / bharat

ఐసీఎమ్​ఆర్​ కొత్త టెస్టింగ్ కిట్​.. ఒమిక్రాన్​ను పసిగట్టేస్తుంది! - ఐసీఎమ్​ఆర్​

Kit for Omicron detection: ఒమిక్రాన్​ను గుర్తించేందుకు ఐసీఎమ్​ఆర్​.. ఓ కొత్త కిట్​ను రూపొందించింది. దీనిని వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు ఇతర కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాలనే ఆలోచనలో ఉంది ఐసీఎమ్​ఆర్​.

Kit for Omicron detection
ఐసీఎమ్​ఆర్​ కొత్త కిట్​.. ఒమిక్రాన్​ను పసిగట్టేస్తుంది!
author img

By

Published : Dec 20, 2021, 1:42 PM IST

Updated : Dec 20, 2021, 1:56 PM IST

ICMR omicron kit: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్​ను పసిగట్టేందుకు సరికొత్త కిట్​ను రూపొందించింది ఐసీఎమ్​ఆర్​(భారత వైద్య పరిశోధన మండలి). ఈ కిట్​ను వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు, కిట్లను సొంతంగా అభివృద్ధి చేసుకునేందుకు కావాల్సిన సాంకేతికతను బదిలీ చేసేందుకు ఇన్​ విట్రో డయొగ్నాస్టిక్స్​(ఐవీడీ) కిట్​ తయారీదారుల నుంచి ఈఓఐ(ఎక్స్​ప్రెషన్​ ఆఫ్​ ఇంట్రెస్ట్​) కోసం ఆహ్వానించింది.

ఒమిక్రాన్​ను గుర్తించేందుకు కావాల్సిన సాంకేతికత(రియల్​ టైమ్​ ఆర్​టీపీసీఆర్​ అస్సే), కిట్​ను డిబ్రుగఢ్​లోని ఐసీఎమ్​ఆర్​ ప్రాంతీయ పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసింది. దీనిపై మేధో సంపత్తి హక్కులు, వాణిజ్యపరమైన హక్కులు తమకే ఉంటాయని ఐసీఎమ్​ఆర్​ స్పష్టం చేసింది. ఒప్పందం కుదుర్చున్న వారికి కిట్​ను తయారు చేసి, అమ్ముకునే అధికారాన్ని ఇస్తామని స్పష్టం చేసింది.

Omicron detection kit: ప్రస్తుతం ఒమిక్రాన్​ను గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి కిట్​లు లేవు. అనుమానిత రోగుల నుంచి నమూనాలను సేకరించి జినోమ్​ సీక్వెన్సింగ్​ కోసం ల్యాబ్​లకు పంపిస్తున్నారు. రిపోర్టులు రావడానికి ఆలస్యమవుతోంది. ఈ తరుణంలో ఐసీఎమ్​ఆర్​ తాజా ప్రకటన ఊరటనిచ్చే విషయం. కిట్​ను ఉపయోగించి ఒమిక్రాన్​ను వేగంగా గుర్తించినట్టు అయితే.. రోగికి మెరుగైన చికిత్స అందిస్తూనే, వైరస్​ కట్టడికి చర్యలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇదీ చూడండి:- ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోండిలా...

Last Updated : Dec 20, 2021, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.