ETV Bharat / bharat

'కరోనా చికిత్సకు ఆ మాత్రలు హానికరం' - కొవిడ్

కరోనా చికిత్సకు ఐబూప్రొఫెన్ లాంటి నొప్పి నివారిణి మాత్రలు హానికరమని భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. కొవిడ్ సోకినప్పుడు నాన్ స్టైరయిడల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ డ్రగ్స్ వేసుకోకపోవడమే మంచిదని సూచించింది. అవసరమైతే పారాసిటమాల్ తీసుకోవచ్చని వెల్లడించింది.

covid
కరోనా
author img

By

Published : Apr 27, 2021, 11:14 PM IST

కరోనా చికిత్సకు ఐబూప్రోఫెన్ లాంటి నొప్పి నివారిణి మాత్రలు హానికరమని భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. వీటివల్ల గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి మరింత నష్టం జరుగుతుందని వెల్లడించింది. అంతేకాకుండా మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించింది.

  • కొవిడ్ సోకినప్పుడు నాన్ స్టైరయిడల్, యాంటీ ఇన్​ఫ్లమేటరీ డ్రగ్స్(ఎన్ఎస్ఏఐడీ) వేసుకోకపోవడమే మంచిదని సూచించింది. అవసరమైతే పారాసిటమాల్ తీసుకోవచ్చని స్పష్టం చేసింది.
  • బీపీ(రక్త పోటు) తగ్గించే మందులు ఏసీఈ ఇనిహిబేటర్స్(రామిప్రిల్, ఎనాలాప్రిల్ మొదలైనవి), యాక్సియో టెన్సన్ రిసెప్టర్ బ్లాకర్స్(ఏఆర్​బీ) (లాసార్టన్, టెల్మిసార్టన్ మొదలైనవి)లు కొవిడ్ తీవ్రతను పెంచుతాయనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.
  • ఏసీఈ ఇనిహిబేటర్స్, యాక్సియో టెన్సన్ రిసెప్టర్ బ్లాకర్స్ మందులు గుండె సంబంధిత వ్యాధుల్ని నయం చేయడంలో, బీపీని నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని తెలిపింది. వీటిని గుండె సంబంధిత రోగులు వాడటం మానేస్తే ప్రమాదమని హెచ్చరించింది.

"సాధరణ ప్రజల మాదిరిగానే హృద్రోగ సమస్యలు ఉన్నవారు, బీపీ సంబంధిత రోగులు, షుగర్ వ్యాధిగ్రస్తులు కొవిడ్ బారిన పడతారు. కానీ వీరికి ఎక్కువ ముప్పేమీ లేదు. అయితే ఈ వ్యాధులున్న వారిలో కొందరికి మాత్రం కరోనా వల్ల తీవ్ర సమస్యలు వస్తున్నాయి."

-భారత వైద్య పరిశోధనా మండలి

డయాబెటిస్ సమస్య తీవ్రంగా ఉన్నవారికి కొవిడ్ వల్ల చాలా ముప్పు ఉంటుందని వెల్లడించింది ఐసీఎంఆర్. కొవిడ్ను ఎదుర్కోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని తెలిపింది. మాంసాహారులు మాంసం తీసుకోవచ్చని పేర్కొంది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి శానిటైజర్, మాస్క్, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది.

ఇదీ చదవండి: '18 ప్లస్​'కు టీకా రిజిస్ట్రేషన్.. మరికొద్ది గంటల్లో​!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.