కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం(డిసెంబర్28)న తిరంగా యాత్ర జరపాల్సిందిగా అన్ని రాష్ట్రాల పీసీసీ లను ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ర్యాలీల సమయంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. సామాజిక మాధ్యమాలలో తిరంగాతో సెల్ఫీ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపింది.
పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యాలయాల్లో జరిగే ఆవిర్భావ దినోత్సవాన్ని పరిశీలించాలని పీసీసీలకు సూచించింది. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని కోరింది. అంతేకాకుండా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులకు పీసీసీలు సంఘీభావం తెలపాలని పేర్కొంది.
ప్రజాస్వామ్య , లౌకిక భావాలను కాపాడటంలో కాంగ్రెస్ ముందుంటుందని అధిష్ఠానం స్పష్టం చేసింది. పేద దేశం నుంచి ప్రపంచాన్ని శాసించే దేశంగా భారత్ ఎదగడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని తెలిపింది.
2020 డిసెంబర్ 28కి కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 136 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ నిర్వహించనుంది. 1885 డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. పార్టీ మొట్టమొదటి సమావేశం ముంబయిలో జరిగింది.
ఇదీ చూడండి: మారని హస్తరేఖలు.. కుటుంబ పరిధి దాటని కాంగ్రెస్!