IBPS PO Jobs Apply Last Date : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) దేశంలోని వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో 4,451 స్పెషలిస్ట్ ఆఫీసర్, ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆన్లైన్ అప్లైకు ఆఖరు తేదీ ఆగస్టు 21. ఆసక్తి గల అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వైబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు..
- ప్రొబేషనరీ ఆఫీసర్/మేనేజ్మెంట్ ట్రైనీ - 3049 ఖాళీలు
- స్పెషలిస్ట్ ఆఫీసర్ - 1402 పోస్టులు
విద్యార్హతలు..
IBPS PO SO Education Eligibility : పీఓ పోస్టులకు దరఖాస్తు చేసే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్ఓ జాబ్స్‌కు అప్లై చేసుకోవాలనుకునే వారు కచ్చితంగా సంబంధిత విద్యార్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితులు..
IBPS PO SO Age Limit : అభ్యర్థుల వయసు 20-35 ఏళ్లలోపు ఉండాలి. ఐబీపీఎస్ నిబంధనల ప్రకారం పీఓ, ఎస్ఓ పోస్టులకు వివిధ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు ( IBPS SO Age Relaxation ) ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఐబీపీఎస్ వెబ్‌సైట్‌ను వీక్షించవచ్చు.
జీతభత్యాలు..
IBPS PO SO Jobs Salary : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు రూ.34,000 నుంచి రూ.55,000 వరకు వేతనాలు ఉంటాయి.
దరఖాస్తు ఆఖరు తేదీ..
- అభ్యర్థులు 2023 ఆగస్టు 21లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం..
IBPS PO And SO Selection Process 2023 : ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. రాతపరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఓవరాల్ కటాఫ్ నిర్ణయిస్తారు. దీంట్లో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన వారిని ఆయా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు..!
IBPS Application Fee :
పీఓ పోస్టులకు..
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు - రూ.175/-
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ - రూ.850/-
ఎస్ఓ పోస్టులకు..
- జనరల్, ఓబీసీ- 850/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు- 175/-
ప్రిలిమ్స్ పరీక్షా తేదీలు!
- IBPS PO Prelims Exam Dates : 2023 సెప్టెంబర్ 23, 30, అక్టోబర్ 1 తేదీల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తారు.
- IBPS SO Prelims Exam Dates : 2023 డిసెంబర్ 30,31
మెయిన్స్ ఎగ్జామ్ డేట్..
- IBPS PO Mains Exam Dates : 2023 నవంబర్ 5
- IBPS SO Mains Exam Dates : 2024 జనవరి 28
పరీక్షా కేంద్రాలు..
IBPS PO SO Exam Centers List : దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, మైసూర్, పుదుచ్చేరి , విజయవాడ, వారణాసి, లఖ్‌నవూ, దిల్లీ, అలహాబాద్, ఆగ్రా సహా, ఇతర నగరాల్లో పరీక్షలను నిర్వహించనున్నారు.
ఈ బ్యాంకుల్లో పోస్టింగ్..
IBPS PO Job Posting : ఐబీపీఎస్ పీఓ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకుల్లో పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు విధానం..
IBPS Application Process : IBPS అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.