Bank Jobs 2023 : బ్యాంకు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. దేశంలోని వివిధ బ్యాంకుల్లో 4,545 క్లర్క్ పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్). అర్హులైన అభ్యర్థులు ఈనెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. వాస్తవానికి ఈనెల 21తో దరఖాస్తు చివరితేదీ ముగియగా.. తాజాగా ఆ గడువును జులై 28 వరకు పొడిగించారు. ఆసక్తి గల ఉద్యోగార్థులు జులై 28లోపు https://www.ibps.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే తొలుత మొత్తం 4045 క్లర్క్ పోస్టులకే ఉద్యోగ ప్రకటనను విడుదల చేసిన IBPS.. మరో 500 పోస్టులను పెంచుతూ మొత్తం 4545 పోస్టులతో సవరించిన నోటిఫికేషన్‌ను ఇటీవలే విడుదల చేసింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారా ఈ నియామకాలను చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
విద్యార్హతలు..
IBPS Clerk Eligibility : అభ్యర్థులు డిగ్రీ పట్టాతో పాటు కచ్చితంగా కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
ఏజ్ లిమిట్..
IBPS Clerk Age limit : అభ్యర్థులు 2023 జులై 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సును కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం పలు కేటగిరీలకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు..
- IBPS Clerk Exam Fee : జనరల్ కేటగిరీ అభ్యర్థులు- రూ.850/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు- రూ.175/-
ఎంపిక విధానం..
Bank Jobs Selection Process : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. ప్రిలిమ్స్ 100 మార్కులకు ఉంటుంది. దీనిలో అర్హత సాధించిన వారు మాత్రమే మెయిన్స్ రాయడానికి అర్హులు. కాగా, మెయిన్స్ 200 మార్కులకు ఉంటుంది.
- దరఖాస్తు చివరితేదీ : 2023, జులై 28
- ప్రిలిమినరీ పరీక్ష : 2023 ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు.
- మెయిన్స్ పరీక్ష : 2023 అక్టోబర్‌లో జరుగుతుంది.
పరీక్ష విధానం..
IBPS Jobs Syllabus : ప్రిలిమినరీ పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ గ్రామర్‌కు సంబంధించిన ప్రశ్నలు 30, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం పరీక్ష సమయం కేవలం 1 గంట మాత్రమే. మెయిన్స్ పరీక్షలో మొత్తం 190 ప్రశ్నలకు 200 మార్కులకు ఉంటాయి. ఇంగ్లీష్ గ్రామర్ 40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ 50 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు ఉంటాయి. మెయిన్స్ పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు.
ప్రాంతీయ భాషల్లోనూ ప్రశ్నాపత్రం..
IBPS Clerk Exam Language : ఐబీపీఎస్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలను ఇంగ్లీష్ సహా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. అయితే ఈ పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.
ఈ బ్యాంకుల్లో పోస్టింగ్..
Bank Jobs 2023 : ఐబీపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీర్ బ్యాంకు, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో నియమిస్తారు.
పూర్తి వివరాల కోసం..
IBPS Website : ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ను వీక్షించొచ్చు.
- ఇవీ చదవండి :
- FCI Jobs : 5000 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. రూ.30వేలు జీతం!.. పోస్టింగ్ ఎక్కడంటే?
- SSC Jobs : ఎస్ఎస్సీ భారీ నోటిఫికేషన్.. డిగ్రీ అర్హతతో 1876 ఎస్ఐ పోస్టుల భర్తీ!
- మీరు క్రీడాకారులా?.. అయితే ఈ జాబ్స్ మీ కోసమే!
- Coast Guard Jobs : కోస్ట్ గార్డ్‌లో జాబ్స్.. 25వేల శాలరీ.. అప్లై చేసుకోండిలా!
- ఆర్మీలో స్పెషల్ కొలువులు.. NCC సర్టిఫికెట్ ఉంటే జాబ్ పక్కా! జీతం రూ.56వేల పైనే