IBPS Clerk Recruitment: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మంచి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) శుభవార్త చెప్పింది. తాజాగా 7000 క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఐబీపీఎస్. జులై 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.
మరో గుడ్ న్యూస్ ఏమిటంటే.. ఈ పరీక్ష ప్రాంతీయ భాషల్లోనూ ఉండనుంది. ఆయా రాష్ట్రాలను బట్టి ఇంగ్లీష్, హిందీతో పాటు.. మరో 13 ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష రాసుకునే వెసులుబాటు ఉంటుంది. క్లర్క్ నియామక ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ ద్వారా జరగనుందని ఐబీపీఎస్ పేర్కొంది. ఎంపిక విధానం ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షా ఫలితాల ఆధారంగా ఉండనుంది. ఈ పోస్టులకు ఇంటర్వ్యూ ఉండదు.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తుల ప్రారంభం : 01-07-2022
- దరఖాస్తులకు చివరితేదీ : 21-07-2022
- ప్రి ఎంట్రెన్స్ టెస్ట్ కాల్‌లెటర్ : 2022 ఆగస్టు
- ప్రి ఎంట్రెన్స్ టెస్ట్ : 2022 ఆగస్టు
- ప్రిలిమ్స్ కాల్‌లెటర్ డౌన్లోడ్ : 2022 ఆగస్టు
- ప్రిలిమ్స్ ఎగ్జామ్ : 2022 సెప్టెంబర్
- ప్రిలిమ్స్ ఫలితాలు : 2022 సెప్టెంబర్/అక్టోబర్
- మెయిన్స్ ఎగ్జామ్ : 2022 అక్టోబర్
- తుది ఫలితాలు : 2023 ఏప్రిల్
ప్రిలిమ్స్ పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్‌లో 30, న్యూమరికల్ అబిలిటీ 35, రీజనింగ్ అబిలిటీ 35 ప్రశ్నల చొప్పున ఉంటాయి. ఒక్కో సమాధానానికి ఒక్కో మార్కు ఉంటుంది. పరీక్షకు గంట సేపు ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారికి కటాఫ్‌ను బట్టి మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో మొత్తం 190 ప్రశ్నలు, 200 మార్కులు ఉంటాయి. సమయం 160 నిమిషాలు ఉంటుంది. దీంట్లో కటాఫ్‌ను బట్టి నేరుగా ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
అర్హతలు..
ఏదైనా డిగ్రీ పట్టా, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్థానిక భాషల్లో మాట్లాడటం, చదవటం, రాయటం వచ్చి ఉండాలి. కంప్యూటర్ కోర్సుకు సంబంధించి సర్టిఫికెట్ ఉండాలి. లేదా డిగ్రీలో ఏదైనా కంప్యూటర్ సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 2021 జులై 1 నాటికి కనీసం 20 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠంగా వయో పరిమితి 28 ఏళ్లు. రిజర్వేషన్ కోటా అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి.
వేతనం: ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు ఎంపికైన వారికి ఇది రూ. 19,900- 47,920 వరకు వేతనం ఉంటుంది. డీఏ, హెచ్ఆర్ఏ, మెడికల్, ట్రాన్స్పోర్ట్ సహా ఇతర అలవెన్సులు మినహాయించి .. అప్పుడే ఉద్యోగంలో చేరినవారికి రూ. 29,453 వేతనం చేతికి అందుతుంది.
అప్లై చేయాలంటే..
1. ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి.
2. హోం పేజీలో 'Apply for Bank Clerks' పై క్లిక్ చేయాలి..
3. రిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి.. అందులో అడిగిన అన్ని వివరాలు సమర్పించాలి.
4. అప్లికేషన్ ఫారం పూర్తిగా నింపి.. కావాల్సిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ఫొటో, సంతకం, ఎడమ చేతి బొడనవేలి ముద్ర, రాతపూర్వక డిక్లరేషన్ వంటివి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
5. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత.. ఓ కాపీని భవిష్యత్ అవసరాల కోసం సేవ్ చేసుకోవాలి.
ఫీజు ఎంత?
- రిజర్వేషన్ లేని అభ్యర్థులు(జనరల్, ఇతరులు) రూ.850 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న వాళ్లు(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు) రూ.175 చెల్లించాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైట్లో పూర్తి వివరాలను క్షణ్నంగా చదివిన తర్వాతే దరఖాస్తు చేయడం ఉత్తమం.
ఇదీ చదవండి: నిరుద్యోగులకు మరో శుభవార్త.. ఎన్పీడీసీఎల్ నోటిఫికేషన్ విడుదల..
సుప్రీం కోర్టులో ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. జీతం రూ.60 వేలకుపైనే