ETV Bharat / bharat

కూరగాయలు అమ్ముతున్న కలెక్టర్​- ఫొటో వైరల్

ఓ ఐఏఎస్ అధికారి ఒక్కసారిగా కూరగాయలు అమ్మే వ్యక్తి అవతారమెత్తారు. తన వద్ద టమాటాలను కొనండి అంటూ సామాజిక మాధ్యమాల్లో ఫొటో పోస్ట్ చేశారు. దీంతో కంగుతినడం నెటిజన్ల వంతైంది. ఇంతకీ కథేంటంటే?

IAS selling vegetables
కూరగాయలు అమ్మిన ఐఏఎస్ అధికారి
author img

By

Published : Aug 26, 2021, 10:27 PM IST

ఐఏఎస్ అధికారి రోడ్లపై కూరగాయలు కొనడమే అరుదు. అలాంటిది రోడ్డు పక్కన కూరగాయాలు విక్రయిస్తూ దర్శనమిచ్చారు ఓ పాలనాధికారి. 'రూ.20కి కిలో టమాటాలు రండి.. కొనండి' అంటూ ఫేస్​బుక్​లోనూ పోస్టు పెట్టారు. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా?

IAS selling vegetables
కూరగాయలు అమ్ముతున్న ఐఏఎస్ అఖిలేశ్ మిశ్రా

ఫొటో కథేంటంటే?

ఉత్తర్​ప్రదేశ్​ రవాణా విభాగంలో ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు సీనియర్ ఐఏఎస్ అధికారి అఖిలేశ్ మిశ్ర. రోడ్డు పక్కన ఆయన కూరగాయలు అమ్ముతున్న ఫొటో ఒకటి తన ఫేస్​బుక్​ పేజీలో కనిపించింది. దీంతో అది వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. కలెక్టర్​ ఏంటి.. కూరగాయలు అమ్మడమేంటి? అని షాకయ్యారు నెటిజన్లు.

IAS selling vegetables
ఐఏఎస్ అఖిలేశ్ మిశ్రా

ఆమె అడిగిందని..!

దీంతో ఈ వ్యవహారంపై స్పందించారు అఖిలేశ్ మిశ్ర. ఫొటో నిజమేనని, కానీ తాను కూరగాయలు అమ్మడం వాస్తవం కాదని చెప్పారు.

IAS selling vegetables
రోడ్డు పక్కన కూరగాయలు విక్రయిస్తూ

"అధికారిక పని నిమిత్తం ప్రయాగ్​రాజ్​ వెళ్లాను. తిరిగి వచ్చే సమయంలో కూరగాయల కోసం దిగాను. ఆ సమయంలో కూరగాయలు అమ్మే ఆవిడ.. తన తన పిల్లాడు ఎటో వెళ్లాడని, తన కోసం చూసి వస్తా అని చెప్పి.. నన్ను తన దుకాణాన్ని కాసేపు చూస్తూ ఉండమని చెప్పింది. దీంతో అక్కడే కూర్చున్నా. ఈ లోపే కొందరు అక్కడికి కొనడానికి వచ్చారు. అది చూసిన నా స్నేహితుడు ఫొటో తీసి నా ఫేస్​బుక్​లో పెట్టారు" అని అఖిలేశ్ వివరించారు.

ఫొటో పెట్టిన విషయం మొదట తనకు తెలీదని అఖిలేశ్ పేర్కొన్నారు. తర్వాత చూసుకొని పోస్టును డిలీట్ చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: ఆ ఐఏఎస్‌ టాపర్స్‌ జంట విడిపోయింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.