చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో.. లద్ధాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత వాయు సేన పూర్తి స్థాయిలో గస్తీ నిర్వహించామని ఎయిర్ ఛీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా తెలిపారు. అందుకే చైనా తన దుందుడుకు చర్యలను తగ్గించిందని స్పష్టం చేశారు.
ఘర్షణల సమయంలో వాయుసేనను దింపటం వల్ల భారత సైన్యం శక్తి సామర్థ్యాలు డ్రాగన్ దేశానికి అర్థమైందని పేర్కొన్నారు. సుఖోయ్-30ఎమ్కేఐ, జాగ్వార్, మిరేజ్-2000 వంటి అత్యాధునిక ఫైటర్ జెట్లు వాస్తవాధీన రేఖ వెంబడి నిరంతరం కాపలా కాశాయని వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి నెలకొనాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలాకోట్ ఘటనలోనూ వాయు సేన అద్భుత తెగువ కనబరిచిందని కొనియాడారు బదౌరియా.