వైమానిక దళానికి చెందిన మిగ్-21 బైసన్ ఫైటర్ యుద్ధ విమానం...సాంకేతిక సమస్య కారణంగా(MIG 21 Bison crash) కూలిపోయింది. రాజస్థాన్‌లోని బాడ్మేర్లో(MIG 21 crash Barmer) సాయంత్రం 5:30 గంటల సమయంలో కూలిపోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో యుద్ధ విమానం సాధారణ శిక్షణా దశలో ఉందని భారత వైమానిక దళ అధికారులు తెలిపారు. ఒక్కసారిగా యుద్ధ విమానం నేలకూలడం వల్ల భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానం కాలిబూడిదైంది.
ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం వెనుక గల కారణాలపై ఐఏఎఫ్(IAF) విచారణకు ఆదేశించింది.
ఇదీ చదవండి: కొండ ప్రాంతంలో కాలేజీ యువతిపై గ్యాంగ్ రేప్