ETV Bharat / bharat

సైనిక సంస్కరణలపై దుమారం- శ్రేణుల మధ్య మాటల రచ్చ

గగనతల రక్షణ కమాండ్‌కు, మిగిలిన థియేటర్‌ కమాండ్లకు వేర్వేరుగా కేటాయించే స్థాయిలో వనరులు లేవని వాయుసేన వాదిస్తున్న నేపథ్యంలో త్రిదళాధిపతి బిపిన్ వాయుసేనాధిపతి బదౌరియా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆర్మీలో వాయుసేన ఓ సహాయ దళం అని సీడీఎస్ వ్యాఖ్యానించగా, దానిని తప్పుబట్టారు బదౌరియా.

RKS Bhadauria
వాయుసేన
author img

By

Published : Jul 13, 2021, 8:38 AM IST

ప్రభుత్వ శాఖల మధ్య సాధారణంగా కనిపించే ఆధిపత్య పోరుకు రక్షణ బలగాలూ అతీతం కాదనిపిస్తోంది! త్రిదళాధిపతి (సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 'ఆర్మీలో శతఘ్ని, ఇంజినీరింగ్‌ విభాగాల మాదిరిగా వాయుసేన సైతం ఓ సహాయ దళం' అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ తరవాత కొద్దిసేపటికే వాయు సేనాధిపతి ఆర్కేఎస్‌ బదౌరియా స్పందిస్తూ 'అది సరికాదు... దేశ రక్షణలో వాయుసేన విస్తృత పాత్ర పోషిస్తోంది' అని పేర్కొన్నారు. వచ్చే నెలకల్లా యుద్ధక్షేత్రాల ఆధారంగా సమీకృత థియేటర్‌ కమాండ్ల ఏర్పాటును మొదలు పెట్టాలనే తొందరలో బిపిన్‌ రావత్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా తొలుత గగనతల రక్షణ కమాండ్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కీలక వ్యక్తుల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది.

రెండేళ్ల క్రితం సీడీఎస్‌ పదవి (త్రివిధ దళాధిపతుల మాదిరిగా రావత్‌ సైతం నాలుగు నక్షత్రాల హోదా జనరలే అయినా, నలుగురిలో ప్రథముడు) ఏర్పాటు ప్రకటనతో దేశీయంగా థియేటర్‌ కమాండ్ల ప్రక్రియ ఊపిరి పోసుకొంది. సమష్టితత్వం ఇనుమడించేలా త్రివిధ దళాలను సమ్మిళితం చేసి మూడేళ్లలో థియేటర్‌ కమాండ్లను రూపుదిద్దే గురుతర బాధ్యతను సీడీఎస్‌కు అప్పగించారు. నిరుడు జూన్‌ నాటికే తొలి కమాండ్‌ ఏర్పాటు కావాల్సి ఉంది కానీ, వివిధ కారణాలతో జాప్యం జరిగింది. గగనతల రక్షణ, మారిటైమ్‌ థియేటర్‌ కమాండ్ల ఏర్పాటు దాదాపు ఖాయమైనా- భౌగోళిక సరిహద్దుల ఆధారంగా ఎన్ని కమాండ్లను నెలకొల్పుతారనే అంశంపై స్పష్టత లేదు. వీటికి సంబంధించి ప్రస్తుతం విస్తృత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

వనరుల కొరత!

వాయుసేన, సైన్యం, నావికాదళాల దగ్గర అవసరాలకు తగినట్లు వేర్వేరు గగనతల రక్షణ వ్యవస్థలు, విమానాల వంటి వనరులు ఉన్నాయి. త్రివిధ దళాలను కలిపి ఏర్పాటు చేయబోయే థియేటర్‌ కమాండ్లకు ఈ వనరులను కేటాయించాల్సి ఉంటుంది. ఈ కమాండ్లలో గగనతల రక్షణ విభాగాలు ఉంటాయి. వీటికి అదనంగా 'గగనతల రక్షణ కమాండ్‌' ఉంటుంది. దేశవ్యాప్త గగనతల రక్షణ వ్యవస్థకు ఇది బాధ్యత వహిస్తుంది. థియేటర్‌ కమాండ్ల అవసరాలకు కేటాయింపులు పోను త్రివిధ దళాల నుంచి సమీకరించే వనరుల్లో అత్యధికం దీని దగ్గరే ఉంటాయి. ఇక్కడే సీడీఎస్‌, చీఫ్‌ ఎయిర్‌మార్షల్‌ మధ్య అభిప్రాయభేదాలున్నాయి. గగనతల రక్షణ కమాండ్‌కు, మిగిలిన థియేటర్‌ కమాండ్లకు వేర్వేరుగా కేటాయించే స్థాయిలో వనరులు లేవని వాయుసేన వాదిస్తోంది. 31 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్న యుద్ధవిమానాల కేటాయింపుపైనా పెదవి విరుస్తోంది. వనరుల కొరతతో కదనరంగంలో ఆత్మరక్షణ వైఖరి అవలంబించాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చని వాయుసేన మాజీలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వాయుసేనకు ఉన్న ఏడు కమాండ్లకు సాయుధ సంపత్తిని కేటాయించి, అవసరాలకు తగినట్లు వాడుకొంటున్నప్పుడు లేని అభ్యంతరం- వాటి స్థానంలో థియేటర్‌ కమాండ్లకు కేటాయింపులు జరిపితే ఎందుకని సీడీఎస్‌ రావత్‌ ప్రశ్నిస్తున్నారు. వనరులను, నిధులను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవడమే లక్ష్యంగా సైనిక సంస్కరణలను పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే థియేటర్ల కమాండ్ల అవసరాలు పూర్తిగా తీరాలంటే అదనంగా కొనుగోళ్లు చేపట్టాల్సి రావచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 32 దేశాలు ఇటువంటి సైనిక సంస్కరణలను అమలు చేశాయి. అమెరికా సహా చాలా దేశాల్లో ఈ సంస్కరణలు పట్టాలెక్కే సమయంలో దళాల మధ్య అభిప్రాయభేదాలు చోటుచేసుకొన్నాయి.

ఆధిపత్య పోరు?

భౌగోళిక సరిహద్దులకు సంబంధించి పొరుగు దేశాలతో భారత్‌కు వివాదాలు ఉన్నాయి. వీటికి ఉగ్రవాదం జత కలవడం వల్ల సహజంగానే దేశీయంగా పదాతి దళానికి ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుంటుంది. దీనితో తమది సహాయ దళంగా మిగులుతుందనే భయం వాయుసేన అధికారుల్లో ఉంది. సీడీఎస్‌ తాజా వ్యాఖ్యలు వారి భయాలను పెంచాయి. వాస్తవానికి ఆధునిక యుద్ధ తంత్రాల్లో వాయుసేన అత్యంత కీలకమైనది! అందుకే చైనాతో సహా చాలా దేశాలు పదాతి దళాల సంఖ్యను కుదించుకొంటున్నాయి. సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలతో వాయుసేనను బలోపేతం చేసుకొంటున్నాయి. ఇరాక్‌ నుంచి అఫ్గాన్‌ వరకు అమెరికా చేసిన యుద్ధాలను చూస్తే తొలుత వాయుసేన, క్షిపణి దళాల ఆధ్వర్యంలోనే దాడులు జరిగాయి. శత్రువులను కకావికలం చేసి అవి సాధించిన విజయాలను సంరక్షించే బాధ్యతలను పదాతి దళాలు స్వీకరించాయి. సీడీఎస్‌కు ఈ విషయాలేవీ తెలియనివి కావు. అయినాసరే- నాలుగు గోడల మధ్య జరగాల్సిన చర్చను బహిరంగ వేదికలపైకి తీసుకొచ్చి, రక్షణ దళాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందనే భావనను ప్రజల్లో కలిగించారు!

- లక్ష్మీతులసి

ఇదీ చూడండి: దేశ మిలిటరీ చరిత్రలోనే అతిపెద్ద సంస్కరణకు చిక్కులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.