ETV Bharat / bharat

దుబాయ్, సింగపూర్‌ నుంచి ఆక్సిజన్ కంటైనర్లు - కరోనాపై పోరులో సేవలు భారత వైమానిక దళం ఘనత

దేశంలో ఆక్సిజన్ పంపిణీని వేగవంతం చేసేందుకు భారత వైమానిక దళం (ఐఎఎఫ్) దుబాయ్, సింగపూర్​ల నుంచి తొమ్మిది క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లను తీసుకొచ్చింది. అంతేగాక వీటిని దేశంలోని వివిధ ఫిల్లింగ్ స్టేషన్లకు విమానంలో రవాణా చేయనుంది.

IAF airlifts oxygen from Dubai, Singapore
భారత వైమానిక దళం
author img

By

Published : Apr 28, 2021, 12:17 PM IST

కరోనాతో సతమతం అవుతున్న భారత్‌ను ఆదుకునేందుకు ప్రపంచదేశాలు ముందుకొస్తున్న వేళ ఆయా దేశాల నుంచి భారత వైమానిక దళం క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లను భారత్‌కు తరలిస్తోంది. దుబాయ్‌, సింగపూర్‌ నుంచి ఐఏఎఫ్.. తొమ్మిది క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లను భారత్‌లోని పనాగఢ్ వైమానికస్థావరానికి తరలించారు. వాటిని అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా జామ్‌నగర్‌, రాంచి తరలించారు.

దేశంలోని ఒక నగరం నుంచి మరో నగరానికి కూడా.. ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్నట్లు ఐఏఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో ఖాళీ అయిన ట్యాంకర్లను కూడా.. ఫిల్లింగ్ స్టేషన్లకు తరలించడంలో ఐఏఎఫ్ ప్రత్యేక పాత్ర పోషిస్తోంది.

ఇవీ చదవండి: భారత్​కు బాసటగా విదేశాలు- వైద్య పరికరాలు సరఫరా

భారత్‌కు సాయం ప్రకటించిన పాక్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.