ఊపిరి ఉన్నంతవరకు తాను రాజకీయాల్లో ఉంటానని నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ తెలిపారు. ఇటీవల తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో ఆయన సహా పార్టీ అభ్యర్థులందరూ ఓటమి పాలయ్యారు. అనంతరం పలువురు కీలక నేతలు పార్టీకి రాజీనామా చేశారు. కమల్ సర్వాధికారం ప్రదర్శిస్తున్నారని కొందరు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన ప్రాణం ఉన్నంత వరకు రాజకీయాల్లోనే కొనసాగుతానని కమల్ సోమవారం ట్వీట్ చేశారు.
ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. రాజకీయాలు ఉన్నంతవరకు తమ పార్టీ ఉంటుందన్నారు. రాజీనామా చేసిన వారు తమ తప్పును కప్పింపుచ్చుకునేందుకు చేసిన నిరాధార ఆరోపణలకు తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కాలమే వారికి బదులిస్తుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: బంగాల్ హింసపై సీజేఐకి మహిళా న్యాయవాదుల లేఖ