ETV Bharat / bharat

'లష్కరే ట్రైనింగ్​ తీసుకున్నా.. రూ. 20 వేలు ఇచ్చారు' - లష్కరే ట్రైనింగ్​

భారత్​లోకి చొరబాటుకు యత్నించి.. భారత సైన్యానికి చిక్కిన ఉగ్రవాది అలీ బాబర్​ పాత్రా(Pakistan news) సంచలన విషయాలు బయటపెట్టాడు. తనను పాక్​ సైన్యం, ఐఎస్​ఐ, లష్కరే తోయిబా(ఎల్​ఈ​ఈటీ) భారత్​కు పంపించాయని చెప్పాడు. తనను విడిపించి, తిరిగి తీసుకెళ్లాలని అక్కడి కమాండర్లకు విజ్ఞప్తి చేశాడు. తనది పేద కుటుంబమని, డబ్బు కోసమే లష్కరేలో చేరానని మీడియాకు వెల్లడించాడు.

I was trained by Lashkar-e-Toiba: Pakistani infiltrator
లష్కరే ట్రైనింగ్​, అలీ బాబర్​ పాత్రా
author img

By

Published : Sep 29, 2021, 5:33 PM IST

జమ్ముకశ్మీర్​లో చొరబాటుకు యత్నించి మంగళవారం.. భారత సైన్యానికి పట్టుబడిన అలీ బాబర్​ పాత్రా పాకిస్థాన్(Pakistan news)​ పంజాబ్​ ప్రాంతానికి చెందినవాడిగా ఒప్పుకున్నాడు. తనకు కరడుగట్టిన ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా (Lashkar-e-taiba) శిక్షణ ఇచ్చిందని చెప్పాడు.

వస్త్ర కర్మాగారంలో(గార్మెంట్​ ఫ్యాక్టరీ) పనిచేస్తున్న సమయంలో.. ఐఎస్​ఐతో(Pakistan news)​ సంబంధాలున్న అనీస్​ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు మీడియా ప్రతినిధులకు వెల్లడించాడు. డబ్బులపై ఆశతో.. లష్కరే ముఠాలో చేరినట్లు నిజం అంగీకరించాడు. కశ్మీర్​లో పరిస్థితులపై ఐఎస్​ఐ, పాక్​ సైన్యం(Pakistan terror news)​, ఎల్​ఈటీ అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని తెలిపాడు.

''మాది పాకిస్థాన్​ పంజాబ్​లోని ఒకారా. మా నాన్న చనిపోయాడు. మా అమ్మతో ఉంటున్నా. మా అక్కకు వివాహం అయింది. అనీస్​ నాకు బాగా డబ్బులు ఇస్తా అన్నాడు. మాది పేద కుటుంబం. అందుకే అతనితో వెళ్లి లష్కర్​లో చేరా. శిక్షణ​ సమయంలో వారు మాకు రూ. 20 వేలు ఇచ్చారు. శిక్షణ పూర్తయితే.. రూ. 30 వేలు ఇస్తామన్నారు.''

- మీడియాతో బాబర్​

తనతో వచ్చిన వారిలో ఒకరిని భారత సైన్యం (Pakistan news India) హతమార్చిందని, మరో నలుగురు పారిపోయారని చెప్పుకొచ్చాడు. భయంతో తాను అక్కడే కూర్చుంటే.. భారత ఆర్మీ అరెస్టు చేసిందని వివరించాడు.

తనను తిరిగి తన తల్లి దగ్గరకు పంపాలని.. లష్కరే ముఠాను కోరాడు బాబర్​. ఈ మేరకు బాబర్​ మాట్లాడిన వీడియోను సైన్యం (Pakistan news India) విడుదల చేసింది. పాకిస్థాన్​ ఆర్మీ కంటే భారత సైన్యమే బాగా ఉందని, పాక్​ చెప్పేవన్నీ అబద్ధాలేనని వాస్తవంగా చూశాక అర్థమైనట్లు వివరించాడు.

''లష్కరే తోయిబా ఏరియా కమాండర్​, ఐఎస్​ఐ, పాకిస్థాన్​ సైన్యానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నన్ను ఎలాగైతే భారత్​కు పంపించారో.. అలాగే తిరిగి మా అమ్మ దగ్గరకు తీసుకెళ్లండి.

భారత సైన్యం రక్తపాతం సృష్టిస్తుందని మాకు చెప్పారు. కానీ ఇక్కడ అంతా ప్రశాంతంగా ఉంది. మా అమ్మకు చెప్పేది ఒకటే.. భారత సైన్యం నన్ను బాగానే చూసుకుంటోంది.''

- అలీ బాబర్​ పాత్రా

సెప్టెంబర్​ 26న ఉరీ సెక్టార్​ వద్ద ఎన్​కౌంటర్​ జరుగుతున్న సమయంలోనే.. పాత్రాను పట్టుకుంది సైన్యం(Pakistan news). సెప్టెంబర్​ 18 నుంచి జరుగుతున్న ఈ ఆపరేషన్​లో మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఇంకో నలుగురు పారిపోయారు.

ఇదీ చూడండి: చొరబాటుకు యత్నించిన ముష్కరుడు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.