ETV Bharat / bharat

'2013లోనూ వారి ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి కదా'

author img

By

Published : Mar 5, 2021, 8:42 PM IST

బాలీవుడ్​ సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడుల గురించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ స్పందించారు. సంబంధిత వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండా.. 2013లోనే వారి ఇళ్లపై దాడులు జరిగాయని ఆమె గుర్తుచేశారు. అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకు వస్తోందని ఆమె ప్రశ్నించారు.

I-T raids on Taapsee, Anurag Kashyap: FM says they were raided in 2013 as well
2013లోనే ఐటీ దాడులు జరిగాయి: ఆర్థికమంత్రి

సినీ ప్రముఖులు తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌ ఇళ్లు, కార్యాలయాలపై జరిగిన ఐటీ దాడులపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. వారి పేర్లు నేరుగా ప్రస్తావించకుండా 2013లోనూ వారి ఇళ్లపై దాడులు జరిగాయని గుర్తుచేశారు. అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు ఉత్పన్నమవుతోందని ఎదురు ప్రశ్నించారు.

తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌ రైతు ఉద్యమానికి మద్దతు పలకడం వల్లే వారిపై కేంద్రం దాడులు చేయించిందన్న విమర్శల నేపథ్యంలో నిర్మల‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఏం జరిగిందంటే?

తాప్సీ, అనురాగ్​ కశ్యప్​ ఇళ్లపై చేసిన దాడుల్లో వీరి దగ్గర లెక్కల్లోలేని దాదాపు రూ.650 కోట్ల మేర ఆర్థిక అవకతవకలను గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు గుర్తించింది. మధు మంతెన, వికాస్ భల్, అనురాగ్​ కశ్యప్​కు చెందిన రెండు నిర్మాణ సంస్థలు తమ తీసిన చిత్రాల బాక్సాఫీస్​ వసూళ్లతో పోలిస్తే ఆదాయాన్ని తక్కువ చేసి చూపించాయని సీబీడీటీ పేర్కొంది. రూ.300 కోట్ల మేర ఉన్న వత్యాసం గురించి సంస్థ ప్రతినిధులు చెప్పలేకపోయారని తెలిపింది.

అలానే భాగస్వామ్యుల మధ్య వాటా లావాదేవీల సంబంధించి రూ.350 కోట్ల మేర పన్ను అక్రమాలను గుర్తించినట్లు సీబీడీటీ వెల్లడించింది. తాప్సీ నుంచి రూ.5 కోట్ల నగదు రశీదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. రెండు సెలబ్రిటీ టాలెంట్​ మేనేజ్​మెంట్ కంపెనీల నుంచి ఈమెయిల్, వాట్సాప్ చాటింగ్, హార్డ్ డిస్క్​లను స్వాధీనం చేసుకున్నామని కేంద్రప్రత్యక్ష పన్నుల బోర్డు చెప్పింది.

ఇదీ చూడండి: సినీప్రముఖులపై ఐటీ దాడులు.. రూ.650 కోట్ల అక్రమాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.