ETV Bharat / bharat

అసోంలో మళ్లీ ఎన్​డీఏదే అధికారం: మోదీ - అసోం ఎన్నికల ప్రచార సభలో మోదీ

అసోంలో ఎన్​డీఏ కూటమిని గెలిపించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. అసోం ప్రజల గుర్తింపును అవమానపరిచిన వారిని ఇక్కడి ప్రజలు సహించరని పేర్కొన్నారు. ఓటు బ్యాంకు కోసం దేశాన్ని కొంత మంది విభజిస్తున్నారని.. దురదృష్టవశాత్తు దాన్నే లౌకికత్వం అని పిలుస్తున్నారని విమర్శించారు.

modi in assam
అసోంలో మళ్లీ గెలుపు ఎన్​డీఏదే: మోదీ
author img

By

Published : Apr 3, 2021, 12:46 PM IST

అసోంలో మహాజోత్​ కూటమి అబద్ధాలు అందరికీ తెలిసిపోయాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అసోంలో ఎన్​డీఏ కూటమే మరోసారి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. అసోం వాసుల గుర్తింపును అవమానపరిచిన వారిని ఇక్కడి ప్రజలు ఏ మాత్రం సహించరని వ్యాఖ్యానించారు. తాముల్​పుర్​లో భాజపా.. ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఎలాంటి వివక్షలేకుండా తాము ప్రజల కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. కానీ ఓటు బ్యాంకు కోసం దేశాన్ని కొంతమంది విడదీస్తారని అన్నారు.

"నాకున్న రాజకీయ అనుభవం, ప్రజల ప్రేమ ఆధారంగా.. ఎన్​డీఏ కూటమిని గెలిపించాలని అసోం వాసులు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని చెప్పగలను. అసోం ప్రజల గుర్తింపును అవమానపరిచిన వారిని, హింసను ప్రోత్సహించేవారిని ఇక్కడి ప్రజలు ఏ మాత్రం సహించరు. మేం అందరి కోసం పని చేస్తాం. కానీ దేశాన్ని ఓటు బ్యాంకు కోసం కొంతమంది విభజిస్తారు. దాన్నే దురదృష్టవశాత్తు లౌకికవాదం అంటున్నారు. కానీ, మాది మతతత్వం అంటున్నారు. ఈ మతతత్వం, లౌకికతత్వాల వల్ల దేశానికి తీరని నష్టం వాటిల్లింది."

-ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.

ఈ ప్రచార సభలో భాజపా కార్యకర్త ఒకరు డీహైడ్రేషన్​కు గురవ్వగా.. అతనికి చికిత్స అందించాలని మోదీ తన వైద్య సిబ్బందిని కోరారు. అసోంలో ఏప్రిల్​ 6న మూడో దశ పోలింగ్ జరగనుంది.

ఇదీ చూడండి:'డీఎంకే-కాంగ్రెస్​ను ఓడిస్తేనే అభివృద్ధి సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.