IRCTC Hyderabad Shirdi Tour Package : దేశంలోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలను చూడాలనుకునేవారికోసం.. ఐఆర్‌సీటీసీ టూరిజం ఈమధ్య ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తోంది. టూరిస్టులకు ఈ ప్యాకేజీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే బడ్జెట్లో ఈ స్పెషల్ టూర్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే.. తాజాగా హైదరాబాద్ నుంచి షిరిడీ టూర్(Shirdi Tour) ప్యాకేజీని అనౌన్స్ చేసింది. 'SAI SANNIDHI EX HYDERABAD' పేరుతో ఈ టూర్‌ను ఐఆర్‌సీటీసీ(IRCTC) ఆపరేట్ చేస్తోంది. ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుండగా.. ప్రస్తుతం సెప్టెంబర్ 20, 2023న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. అసలు ఎన్ని రోజులు టూర్ సాగుతుంది? టికెట్ ధర ఎంత? ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్-షిరిడీ పర్యటన సాగనుందిలా..
IRCTC Hyderabad to Shirdi Tour Package : ఐఆర్‌సీటీసీ 'SAI SANNIDHI EX HYDERABAD' అనే పేరుతో ఆపరేట్ చేస్తున్న ఈ టూర్ 2 రాత్రులు, 3 రోజులు కొనసాగుతుంది. ఈ ట్రైన్ (అజంతా ఎక్స్ ప్రెస్ train no. 17064).. సెప్టెంబర్ 20న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 06.50 నిమిషాలకు బయల్దేరుతుంది. ఆ రోజు రాత్రంతా రైలులో ప్రయాణిస్తారు.
Second Day : రెండో రోజు 21న ఉదయం 07.10 నిమిషాలకు నాగర్ సోల్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి షిరిడీ వెళ్తారు. అక్కడ హెటల్లోకి చెకిన్ అవుతారు. అనంతరం షిరిడీ సాయినాథుని ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి శని శిగ్నాపూర్ వెళ్తారు. అక్కడి నుంచి బయల్దేరి నాగర్ సోల్ రైల్వే స్టేషన్‌కు బయల్దేరుతారు. రాత్రి 08 గంటల 30 నిమిషాలకు మీ జర్నీ తిరిగి స్టార్ట్ అవుతుంది.
Third Day : ఆ రోజు రాత్రంతా ట్రైన్ జర్నీలో ఉంటారు. ఇక చివరగా మూడో రోజు ఉదయం 08గంటల 50 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకోవటంతో మీ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
IRCTC Shirdi Tour Ticket Prices : హైదరాబాద్ శిర్డీ టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే.. సింగిల్ షేరింగ్‌కు 13,830గా టికెట్ ధర ఉంటే.. అదే డబుల్ షేరింగ్‌కు మాత్రం రూ. 8,480గా ఉంది. అదేవిధంగా ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 6,760గా నిర్ణయించారు. ఇక కంఫర్ట్ క్లాస్ల్ కోచ్‌లో ధరల విషయానికి వస్తే.. ఇందులో చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. అదే స్టాండర్డ్ క్లాస్‌లో చూస్తే.. సింగిల్ షేరింగ్‌కు రూ. 12,140, డబుల్ షేరింగ్‌కు రూ. 6,790గా ఐఆర్‌సీటీసీ నిర్ణయించింది. ఈ టూర్ ప్యాకేజీలో టికెట్లతో పాటు హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కవర్ అవుతాయి. అదేవిధంగా నిబంధనలు కూడా వర్తిస్తాయి. మరిన్ని వివరాలకోసం.. www.irctctourism.com క్లిక్ చేయండి.
IRCTCలో రైలు టికెట్స్ బుక్ అవ్వట్లేదా.. అమెజాన్, పేటీఎంల్లో ట్రై చేయండి!
How to Cancel IRCTC Train Tickets Online : ఐఆర్సీటీసీలో.. ట్రైన్ టికెట్స్ రద్దు చేసుకోవడం ఎలా..?