ETV Bharat / bharat

కోల్​కతాలో హైదరాబాద్​ వాసి అనుమానాస్పద మృతి

హైదరాబాద్​కు చెందిన బ్యాంకు ఉద్యోగి కోల్​కతాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అయితే.. ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.

hyderabad man died in kolkata
కోల్​కతాలో హైదరాబాదీ మృతదేహం
author img

By

Published : Jul 20, 2021, 5:52 PM IST

Updated : Jul 20, 2021, 10:52 PM IST

బంగాల్​ రాజధాని కోల్​కతాలో హైదరాబాద్​కు చెందిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన మృతదేహాం నగరంలోని సాల్ట్​లేక్​ ప్రాంతంలోని ఓ అపార్ట్​మెంట్​లో పడి ఉంది. అయితే ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు తేల్చారు. ఘటనా స్థలం నుంచి సూసైడ్​ నోట్​ను స్వాధీనం చేసుకున్నారు.

నోట్లో గ్యాస్​ పైపులు..

పి. సమ్రిత్ హైదరాబాద్​కు చెందిన వ్యక్తి. ప్రైవేట్​ బ్యాంకులో ఉద్యోగం రీత్యా.. కోల్​కతా, సాల్ట్​ లేక్​ ప్రాంతంలోని ఓ అపార్ట్​మెంట్​లో తన సహోద్యోగులతో కలిసి నివసిస్తున్నారు. సోమవారం అతని మృతదేహాన్ని పోలీసులు అపార్ట్​మెంట్​లో గుర్తించారు. గ్యాస్ పైపులు నోట్లో, ముక్కులో ఉండగా.. ప్రాణాంతక వాయువు కారణంగా సమ్రిత్ మరణించారని భావిస్తున్నారు.

విశాఖపట్నం గ్యాస్​ లీక్​తో..

సమ్రిత్​ తల్లిదండ్రులు 2020లో జరిగిన విశాఖపట్నం గ్యాస్​ లీక్​లో మృతి చెందారు. అప్పటి నుంచి డిప్రెషన్​లో ఉన్నారు సమ్రిత్​. ఈ నేపథ్యంలోనే అదే విధంగా సమ్రిత్ తన ప్రాణాలు తీసుకోవాలని చూసినట్టు పోలీసులు తెలిపారు. విశాఖపట్నంలో లీకైన స్టెరిన్​ గ్యాస్​ కోసం ఆయన కోల్​కతాలో వెతికినట్లు పోలీసులు పేర్కొన్నారు. అది దొరకగపోగా.. హీలియం గ్యాస్​ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసి, దానితో ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. అతని మృతదేహాన్ని పోస్ట్​మార్టానికి పంపించారు.

సూసైడ్​ నోట్​ ఆయనదేనా? కాదా? అనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని చేతిరాత శాంపిల్స్​ను తీసుకున్నారు.

ఇవీ చదవండి:పట్టపగలే న్యాయవాది​పై కత్తులతో దాడి

Viral Video: వరదలో రోడ్డు దాటేందుకు యత్నించి.. చివరకు..

Last Updated : Jul 20, 2021, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.