మహారాష్ట్ర జల్నా జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఒక దుండగుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను అంతా ఫోన్లో రికార్డు చేశాడు. తర్వాత ఈ విషయం తెలుసుకున్న భర్త.. మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వివాహిత రేణుకై పింపల్గామ్ అనే గ్రామంలో నివసిస్తోంది. రవి దత్తాత్రేయ సక్పాల్ అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడాలని వివాహితపై ఒత్తిడి తెచ్చారు ఐదుగురు నిందితులు. అనంతరం రవి దత్తాత్రేయ వివాహితకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. దాన్ని మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. బాధితురాలితో మాట్లాడిన అసభ్యకర ఫోన్ సంభాషణ రికార్డింగులను, వీడియోలను ఆమె భర్తకు పంపించారు నిందితులు. దీంతో మనస్తాపానికి గురైన వివాహిత భర్త.. సమాజంలో తన పరువు పోతుందని విషం తాగి అత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ముగ్గురు పురుషులతో పాటు ఇద్దరు మహిళలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
రూ. 1,000 అప్పు తీర్చలేదని మహిళపై అత్యాచారం..
అప్పుగా తీసుకున్న రూ.వెయ్యి తిరిగి చెల్లించలేదని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడో దుండగుడు. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా కుమార్ధుబి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ వివాహిత.. విక్కీ రవిదాస్ అనే వ్యక్తి నుంచి రూ.7,000 అప్పు తీసుకుంది. అందులో రూ.6,000 తిరిగి చెల్లించింది. కాగా మిగిలిన రూ.1,000 కోసం కొద్ది రోజుల నుంచి బాధితురాలిని విక్కీ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం బాధితురాలు ఒంటరిగా ఇంట్లో ఉండగా వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
"స్నానం చేసి బాత్ రూం నుంచి తన గదిలోకి వెళ్తున్న బాధితురాలిని.. విక్కీ అస్మాత్తుగా వచ్చి వెనుక నుంచి పట్టుకున్నాడు. నేను అరిచే లోపే నోట్లో గుడ్డ కుక్కి అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు"అని బాధితురాలు పేర్కొంది. భర్త వచ్చిన తర్వాత జరిగిన విషయన్నంతా అతడికి వివరించింది బాధితురాలు. దీంతో కోపోద్రిక్తుడైన వివాహిత భర్త.. విక్కీ ఇంటికి వెళ్లి నిలదీశాడు. బరితెగించిన నిందితుడు.. తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తానని బాధితులను బెదిరించాడు. అనంతరం బాధితురాలి భర్త కుమార్ ధుబి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. ఫిర్యాదు తీసుకోలేదు పోలీసులు. ఆ తర్వాత వివాహిత భర్త.. కుటుంబ సభ్యులతో సహా వెళ్లగా నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు.
డ్రగ్స్‌కు డబ్బులివ్వలేదని భార్య హత్య..
పంజాబ్‌లో దారుణం జరిగింది. మత్తు పదార్థాలకు బానిసైన ఓ వ్యక్తి.. డ్రగ్స్‌కు డబ్బులివ్వలేదని తన భార్యను కిరాతకంగా కొట్టి చంపేశాడు. ఈ ఘటన మోగా జిల్లాలోని చక్కివాలా ప్రాంతంలో జరిగింది. నీలం కౌర్ అనే మహిళ వంటగదిలో ఉండగా.. భర్త పరంజిత్ సింగ్ డ్రగ్స్‌కు డబ్బులివ్వమని అడిగాడు. దానికి నీలం కౌర్ నిరాకరించడం వల్ల ఆమెపై కత్తితో దాడి చేశాడు. కత్తి విరిగిపోవడం వల్ల అక్కడే ఉన్న పెనంతో బలంగా నీలం కౌర్ తలపై పలుమార్లు మోదాడు. దీంతో బాధితురాలు అక్కడికక్కడే మృతిచెందింది. భార్యను చంపిన తర్వాత పరంజిత్ సింగ్ మోగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఘటన జరిగే సమయంలో ఇంట్లో ఎవరూ లేరని నిందితుడి తల్లి తెలిపింది.
ఇవీ చదవండి : పూజారిపై పెట్రోల్ బాంబ్‌తో దాడి.. కుటుంబాన్ని చంపి వ్యక్తి ఆత్మహత్య
మరో 'శ్రద్ధా వాకర్' హత్య.. ప్రేయసి శవాన్ని ముక్కలు చేసి బావిలో పడేసి..