కరోనా కోరలు చాస్తున్న వేళ బిహార్‌లో దారుణ ఘటన జరిగింది. తన భార్యకు కొవిడ్ సోకిందని ఆగ్రహించిన అతుల్ లాల్ అనే వ్యక్తి ఆమెను హత్యచేశాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పట్నాలోని జర్నలిస్టు నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.
గొంతు కోసి..
చిత్రగుప్త నగర్‌కు చెందిన అతుల్ లాల్ అనే వ్యక్తి రైల్వే స్టేషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. ఓ ప్రైవేటు సంస్థలో అతని భార్య పనిచేస్తోంది. ఆమెకు కరోనా సోకిందనే విషయం తెలుసుకున్న అతుల్.. తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. దీంతో ఆదివారం రాత్రి కత్తితో ఆమె గొంతు కోసేశాడు. అనంతరం అతను మేడ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: కరోనా సోకిందని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య