ETV Bharat / bharat

విడాకుల నోటీసు పంపిందని.. భార్య, అత్త, మరదలి హత్య! - భార్య భర్త గొడవలు

దాంపత్య కలహాలు ముగ్గురి హత్యకు దారితీశాయి. భార్యతో తరచూ గొడవ పడుతూ.. చివరకు ఆమెను చంపేశాడు ఓ భర్త (Husband killed wife news). మహిళ తల్లి, చెల్లిని సైతం కిరాతకంగా కడతేర్చాడు.

husband killed
భార్యను హత్య చేసిన భర్త
author img

By

Published : Sep 29, 2021, 7:36 PM IST

కర్ణాటకలో దారుణమైన ఘటన జరిగింది. రాయచూర్​ (Karnataka Raichur News) శివార్లలోని యరామర ప్రాంతంలో ఒకే కుటుంబంలో ముగ్గురు హత్యకు గురయ్యారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. మృతులను సంతోషి(45), వైష్ణవి(18), ఆర్తి(16)గా గుర్తించారు. వైష్ణవి మాజీ భర్త సౌరభ్ అలియాస్ సాయి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

THREE FROM SAME FAMILY KILLED FOR FAMILY DISPUTE MATTERS
విగతజీవిగా పడి ఉన్న సంతోషి

ఆరు నెలల క్రితం వైష్ణవికి, హైదరాబాద్​కు చెందిన సాయికి వివాహం జరిగింది. అప్పటి నుంచి ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి. రోజూ వీరి మధ్య తగాదా జరిగేదని, దంపతుల మధ్య సఖ్యత ఉండేది కాదని తెలిసినవారు చెప్పారు. దీంతో వైష్ణవి తన భర్తకు విడాకుల నోటీసు ఇచ్చిందని వెల్లడించారు.

వైష్ణవి మృతదేహం

పక్కపక్కనే పడి ఉన్న వైష్ణవి, ఆర్తి

దీనిపై భర్త సాయి.. తీవ్రంగా స్పందించాడు. మంగళవారం రాత్రి పెద్ద గొడవ పెట్టుకున్నాడు. అదే ఆవేశంలో భార్యను, ఆమె తల్లి, చెల్లిని సైతం హత్య (Husband kills wife) చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

పొరుగింటివారికి ఫోన్...

మంగళవారం హత్యకు గురికాక ముందు వీరు.. పొరుగింటివారికి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అర్ధరాత్రి అయినందు వల్ల ఎవరూ కాల్ లిఫ్ట్ చేయలేదు. పొరుగింటివారు ఉదయం వారిని సంప్రదించగా.. ఎటువంటి స్పందన రాలేదు. ఇంటికెళ్లి పరిశీలించగా వారి మృతదేహాలు కనిపించాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.