పళ్లు తోముకోకుండా కొడుకుకు ముద్దు పెట్టడాన్ని అడ్డుకుందని.. కట్టుకున్న భార్యనే చంపేశాడు ఓ వ్యక్తి. కేరళలోని పాలక్కడ్‌లో ఈ ఘటన జరిగింది. తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన దీపిక(28), తన భర్త అవినాశ్(30)తో కలిసి పాలక్కడ్‌లోని కరాకురుస్సి ప్రాంతంలో నివాసం ఉంటోంది. వీరికి ఏడాదిన్నర వయసున్న కొడుకు ఉన్నాడు. బ్రష్ చేయకుండా కుమారుడ్ని ముద్దు పెట్టుకునేందుకు అవినాశ్ ప్రయత్నించగా.. భార్య దీపిక అడ్డుకుంది.
కత్తితో దారుణంగా..
కోపంతో ఊగిపోయిన అవినాశ్.. దీపికపై కత్తితో దాడి చేశాడు. దీంతో మహిళ తల, మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి. పొరుగింటివారు దీపికను స్థానిక ఆస్పత్రికి తలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మరో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆమె ప్రాణాలు కోల్పోయింది.
నిందితుడు అవినాశ్ ఎయిర్‌ఫోర్స్ సివిల్ కాంట్రాక్ట్ కంపెనీలో సహాయ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితమే కుటుంబ సభ్యులతో కలిసి కరకురిస్సికి మారాడు. అవినాశ్‌కు దీపిక రెండో భార్య. ఒడిశాకు చెందిన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన అతడు.. 2019లో దీపికను పెళ్లి చేసుకున్నాడు.
ఇదీ చదవండి: