ETV Bharat / bharat

Husband Chops Wife Into Pieces : భార్యను ముక్కలుగా నరికి నదిలో పారేసిన భర్త.. పెళ్లైన మూడు నెలలకే.. - భార్యను ముక్కలుగా నరికిన భర్త

Husband Chops Wife Into Pieces : దిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ తరహా హత్య ఒడిశాలో వెలుగు చూసింది. భార్యను దారుణంగా చంపి.. ముక్కలుముక్కలుగా నరికాడు ఓ వ్యక్తి. అనంతరం వాటిని తీసుకెళ్లి రుషికల్య నదిలో పారేశాడు.

Husband Chops Wife Into Pieces
Husband Chops Wife Into Pieces
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 2:34 PM IST

Husband Chops Wife Into Pieces : భార్య గొంతు నులిమి హత్య చేసి.. ఆమె శరీరాన్ని ముక్కలుముక్కలుగా నరికాడో భర్త. అనంతరం సాక్ష్యాలు లభించకుండా ఉండేందుకు వాటిని రుషికల్య నదిలో పారేశాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇదీ జరిగింది
సొరోడా పోలీస్ స్టేషన్​ పరిధిలోని భాగబన్​పుర్​ గ్రామానికి చెందిన నారాయణ్​ ములి అనే వ్యక్తి.. బులి అనే మహిళతో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. మూడు నెలల క్రితం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే, బుధవారం రాత్రి ఓ విషయంలో వీరిద్దరి మధ్య గొడవ తలెత్తింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వివాదం తీవ్రంగా మారింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త నారాయణ్ ములి.. భార్య బులి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని భుజాలపై ఎత్తుకుని రుషికల్య నది వద్దకు తీసుకెళ్లాడు. తర్వాత ఆమె కాళ్లు, చేతులు, తొడలు, మెడను ముక్కలుగా నరికాడు. అనంతరం సాక్ష్యాలు లభించకుండా ఉండేందుకు వాటిని రుషికల్య నదిలో పడేసి వెళ్లిపోయాడు.

మరోవైపు తమ కూతురు కనిపించకుండాపోవడం వల్ల బులి తల్లిదండ్రులు సొరోడా పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె భర్త నారాయణ్​ను అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. తానే మృతదేహాన్ని ముక్కలుగా నరికి నదిలో పడేశానని పోలీసులకు చెప్పాడు. అనంతరం నిందితుడిని తీసుకుని మృతదేహం కోసం నదిలో గాలించారు.

Husband Chops Wife Into Pieces
భర్తతో మృతురాలు (పాత ఫొటో)
Man kills wife
భర్తతో మృతురాలు (పాత ఫొటో)

ముక్కలుగా నరికి మిక్సీలో వేసి..
అంతకుముందు మూడు నెలల క్రితం మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే జరిగింది. సహజీవనం చేస్తున్న మహిళను 56ఏళ్ల వ్యక్తి కొట్టి చంపాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని.. ముక్కలు చేశాడు. అనంతరం ఆ శరీర భాగాలను కుక్కర్​లో ఉడికించాడు. కొన్ని శరీర భాగాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేశాడు.
ఠాణెలోని మీరా భయందర్ ప్రాంతంలో ఉన్న ఆకాశగంగా భవనంలో 32 ఏళ్ల సరస్వతి వైద్య, 56 ఏళ్ల మనోజ్ సహాని మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. ఓ రోజు సాయంత్రం ఆకాశగంగా భవనంలో భరించలేని దుర్వాసన వస్తోందంటూ పోలీసులకు ఆ భవనంలో ఉండే వారు ఫోన్ చేశారు. నయానగర్ పోలీసులు వెళ్లి పరిశీలించగా సరస్వతి హత్యకు గురైనట్లు గుర్తించారు. ముక్కలు చేసిన ఆమె మృతదేహ భాగాలను కనుగొన్నారు. మృతదేహ భాగాలను అక్కడి నుంచి తరలించారు. నిందితుడు మనోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. గొడ్డలితో ఐదు ముక్కలుగా నరికి..

జాబ్ వదిలేస్తామన్నందుకే 8 మంది దారుణ హత్య.. ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.