Husband Burnt Pregnant Wife: గర్భవతి అయిన భార్యను, మూడేళ్ల కుమారుడిని సజీవ దహనం చేశాడు ఓ కిరాతకుడు. ఇందుకు అతని సోదరి కూడా సహకరించింది. ఈ ఘటన బిహార్ సుపౌల్లోని త్రివేణీగంజ్లో జరిగింది. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆరు నెలలుగా గొడవలు..
బంధువుల వివరాల ప్రకారం.. రైల్వేలో ఉద్యోగం సంపాదించేందుకు లక్ష రూపాయలు ఇవ్వమని నిందితుడు.. భార్య రంజన దేవీని (27) డిమాండ్ చేశాడు. ఈ విషయంపైనే గత ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా వీరిద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన నిందితుడు గర్భిణీ అయిన భార్య, మూడేళ్ల కుమారుడి కళ్లకు గంతలు కట్టి వారిద్దరినీ మంచంపై తాళ్లతో బంధించాడు. అనంతరం వారిని సజీవ దహనం చేశాడు. ఈ దారుణానికి పాల్పడేందుకు అతని సోదరి కూడా సహకరించింది.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులు కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి : 'ఆయన నుంచి చాలా నేర్చుకున్నా'.. జస్టిస్ సుభాష్ రెడ్డిపై సీజేఐ ప్రశంసలు