ETV Bharat / bharat

స్కార్పియో కోసం వివాహిత సజీవదహనం.. భర్త, అత్తమామలు కలిసి...

Husband Burns Wife: వరకట్న వేధింపులు వివాహిత ప్రాణాన్ని బలిగొన్నాయి. స్కార్పియో ఇవ్వలేదని.. తన సోదరిని సజీవ దహనం చేసినట్లు మృతురాలి సోదరుడు ఆరోపించారు. బిహార్​లోని నవాదాలో ఈ ఘటన జరిగింది.

Husband Burns Wife Alive
Husband Burns Wife Alive
author img

By

Published : Feb 20, 2022, 3:46 PM IST

Husband Burns Wife: బిహార్​ నవాదాలో వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైంది. డబ్బు, స్కార్పియో కారు కోసం.. తన సోదరిని ఆమె భర్త, అత్తమామలు కలిసి సజీవ దహనం చేసినట్లు మృతురాలి సోదరుడు రాహుల్​ ఆరోపించాడు. షాపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మహారథ్​ గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

స్కార్పియో కోసమే..

2019 మే 1న కోమల్​ కుమారికి.. కృష్ణ కుమార్​తో వివాహమైంది. వారి స్తోమతకు తగ్గట్లుగా కట్నం ముట్టజెప్పారు. అయితే.. తన సోదరిని తరచూ అదనపు కట్నం కోసం ఆమె అత్తమామలు వేధించేవారని రాహుల్​ పోలీసులకు వివరించాడు. తన పెళ్లి సమయంలోనూ.. బావ కృష్ణ స్కార్పియో డిమాండ్​ చేశాడని అన్నాడు.

ఈ క్రమంలోనే శుక్రవారం తన బావ ఫోన్​ చేసి.. ప్రెషర్​ కుక్కర్​ పేలగా కుమారిని ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పాడని రాహుల్​ చెప్పుకొచ్చాడు. అక్కడికి వెళ్లేసరికి.. తన సోదరి కుమారుడితో ఆమె అత్తమామలు పరారయ్యారని చెప్పాడు. కుమారి చికిత్స పొందుతూ మరుసటి రోజు చనిపోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు.

నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని రాహుల్​.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇవీ చూడండి: నదిలోకి దూసుకెళ్లిన కారు.. పెళ్లి కుమారుడు సహా తొమ్మిది మంది మృతి

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల సజీవ దహనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.