ETV Bharat / bharat

నలుగురు భార్యల కోసం '13 అంతస్తుల' ఇల్లు.. భరణం కోసం రెండో వైఫ్ డిమాండ్​.. ట్విస్ట్​ ఏంటంటే? - ఉత్తర్​ప్రదేశ్​లో మీర్జాపుర్​లో అక్రమం నిర్మాణం

Husband Built 13 Floor Building For Four wives : ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి తన నలుగురు భార్యల కోసం ఏకంగా 13 అంతస్తుల ఇంటిని నిర్మించాడు. వారితో కలిసి కొన్నాళ్ల క్రితం వరకు ఆ ఇంట్లోనే ఉండేవాడు. అయితే అతడి రెండో భార్య.. విడాకుల కోసం కొన్నాళ్ల క్రితం కోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Husband Built 13 Floor Building For Four wives

author img

By

Published : Jul 31, 2023, 10:37 AM IST

Updated : Jul 31, 2023, 11:47 AM IST

నలుగురు భార్యల కోసం 13 అంతస్తుల ఇల్లు

Husband Built 13 Floor Building For Four wives : తన నలుగురు భార్యల కోసం ఏకంగా 13 అంతస్తుల ఇంటిని నిర్మించాడు ఓ వ్యక్తి. ఆ ఇంట్లో ఆరేళ్ల క్రితం వరకు భార్యలు, వారి పిల్లలతో కలిసి ఆనందంగా జీవించాడు. అయితే ఆ వ్యక్తి.. రెండో భార్య కొన్నాళ్ల క్రితం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. కోర్టు దంపతులిద్దరికీ విడాకులు మంజూరు చేసి.. భార్యకు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశించింది. ఆ భరణాన్ని నాలుగేళ్లు అయినా భర్త ఇవ్వకపోవడం వల్ల.. ఆ ఇంటిని కోర్టు స్వాధీనం చేసుకుంది. అప్పుడే ఆ 13 అంతస్తుల భవన నిర్మాణంలో జరిగిన అవకతవకలు బయటపడ్డాయి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో మీర్జాపుర్​లో జరిగింది.

అసలేం జరిగిందంటే..
మీర్జాపుర్​కు చెందిన సియారామ్​ పటేల్​కు నలుగురు భార్యలు. ఆయన తన భార్యల కోసం అదాల్‌హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రుతిహార్ గ్రామంలో 22 ఏళ్ల క్రితం 13 అంతస్తుల ఇల్లును నిర్మించాడు. ఆ భవనంలోనే తన కుటుంబంతో కలిసి కొన్నాళ్ల క్రితం వరకు నివసించేవాడు. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం సియారామ్ పటేల్ రెండో భార్య అర్చనా సింగ్​.. భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఆమెకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. అర్చనకు రూ.3,82,500 భరణం ఇవ్వాలని 2018లో చునార్​ ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. ఆ డబ్బును సియారామ్ తన భార్యకు ఇప్పటికీ ఇవ్వకపోవడం వల్ల అసలు విషయం బయటపడింది.

Husband Built 13 Floor Building For Four wives
సియారామ్​ 13 అంతస్తుల ఇల్లు

ఈ క్రమంలో సియారామ్ రెండో భార్య అర్చన తనకు భర్త నుంచి భరణం అందలేదని కోర్టును ఆశ్రయించింది. అప్పుడు కోర్టు.. సియారామ్​ 13 అంతస్తుల ఇంటిని స్వాధీనం చేసుకుని.. వేలం వేయాలని నిర్ణయించింది. అప్పుడు సియారామ్ ఇంటికి వచ్చిన అధికారులకు గ్రామస్థులు విస్తుపోయే నిజాలు చెప్పారు. సియారామ్ బంజరు భూమిలో ఇల్లు నిర్మించాడని శ్రుతిహార్ గ్రామస్థులు తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వెల్లడించారు.

13 అంతస్తుల భవనం

"సియారామ్ ఇల్లు ప్రస్థుతం కూలిపోయే స్థితిలో ఉంది. గోడలకు పగుళ్లు ఉన్నాయి. అందులో ఆరేళ్లుగా ఎవరూ నివసించడం లేదు. భవనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత సియారామ్ సోన్‌భద్ర జిల్లాలోని గణేశ్​పుర్ గ్రామంలో నివసిస్తున్నాడు. ఈ భవనం చుట్టుపక్కల నివసించే ప్రజలు బలమైన గాలి వీచినప్పుడు భయపడుతున్నారు. పిల్లర్లు లేకుండానే సియారామ్ భవనాన్ని నిర్మించాడు. అధికారులు ఈ భవనాన్ని కూల్చివేయాలి. లేదంటే ఈ భవనం కూలి ప్రమాదం జరగొచ్చు."

---రామేశ్వర్​, శ్రుతిహార్ గ్రామస్థుడు

కోర్టు భరణం ఇవ్వమని సియారామ్​కు నాలుగేళ్ల కిందట ఆదేశాలిచ్చినా ఇప్పటివరకు అందలేదని అతడి రెండో భార్య అర్చనా సింగ్ తెలిపారు. తన కుమార్తెకు 18 ఏళ్లు అని.. ఆమె చదువు కోసం డబ్బులు అవసరమని ఆమె చెప్పారు. ఇంకా తమకు న్యాయం జరగలేదని అర్చనా సింగ్ అన్నారు.

13 అంతస్తుల భవనానికి సీల్ వేసిన అధికారులు

Last Updated : Jul 31, 2023, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.