HRMS Railway Employee Login Online : దేశంలో ప్రజా రవాణా వ్యవస్థలో రైల్వేల పాత్ర ఎంతో కీలకమైనది. భారతీయ రైల్వేల్లో(Indian Railways) సుమారు 14లక్షల మంది పనిచేస్తున్నారంటేనే.. దాని స్థాయి ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను కలిగిన రైల్వే వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి.. మానవుల వనరుల నిర్వహణ వ్యవస్థ(HRMS) అవసరం.
Railway Employee HRMS Login Process in Telugu : అయితే.. లక్షలాది మంది ఉద్యోగుల వివరాలను, ఇతర సమాచారాన్ని పేపర్ ఫార్మాట్లో నిల్వ చేయడం చాలా కష్టం. ఈ నేపథ్యంలో.. రైల్వే ఉద్యోగుల పనిని సులభతరం చేయడానికి, తక్కువ సమయంలో వారి వివరాలను తెలుసుకునేందుకు.. HRMS ఇండియన్ రైల్వే పోర్టల్ ను తీసుకొచ్చారు. 2019 నవంబర్‌లో ఇండియన్ రైల్వేస్ హెచ్‌ఆర్‌ఎంఎస్ మాడ్యూల్ ప్రారంభించబడింది. దీని ద్వారా రైల్వే ఉద్యోగులు చాలా సులభంగా ఆన్లైన్లో తమ స్వీయ సేవలు, ప్రావిడెంట్ ఫండ్ వివరాలు, సేవా వివరాలు, బదిలీలు, సెలవులు మొదలైన వివరాలను తెలుసుకుంటున్నారు. ఇంతకీ.. రైల్వే HRMSను ఎలా ఉపయోగించాలి? అందులోకి ఎలా లాగిన్ కావాలి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
HRMS Railway Employee Login Process : ఇంతకుముందు రైల్వే ఉద్యోగుల సేవలకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉండేవి కాదు. కానీ ఈ ఆన్లైన్ పోర్టల్ రాకతో.. ఇప్పుడు రైల్వే ఎంప్లాయిస్ ఆన్లైన్లోనే తమ సమాచారాన్ని సులభంగా పొందుతున్నారు. దీని ద్వారా రైల్వే శాఖలోని ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగుల సమాచారం ఒకే దగ్గర నిక్షిప్తమై ఉంటోంది.
How to Register into HRMS Railway Employee Login Portal in Online :
రైల్వే ఉద్యోగి HRMS లాగిన్ పోర్టల్‌లో ఎలా రిజిస్టర్ అవ్వాలంటే..
- భారతీయ రైల్వే HRMS వెబ్‌సైట్ https://indianrail.gov.in/HRMS/ ను సందర్శించాలి.
- మీరు మొదటిసారిగా లాగిన్ అవుతున్నట్లయితే.. భారతీయ రైల్వే హోమ్ పేజీ HRMS వెబ్‌సైట్‌లో 'Need Help for Login?' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ 11-అంకెల PF/ఉద్యోగి నంబర్‌ను IPAS ID/HRMS IDగా నమోదు చేయాలి. ఆపై దిగువ ఇచ్చిన 'Go' బటన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- HRMS ID/లాగిన్ ID, IPAS ఉద్యోగి ID, ఉద్యోగి పేరు, శాఖ, హోదా, రైల్వే యూనిట్, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ లాంటి వివరాలన్ని డిస్ ప్లే అవుతాయి.
- తర్వాత పైన పేర్కొన్న వివరాలన్నీ సరైనవో కాదో చెక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత HRMS ID, డిఫాల్ట్ పాస్‌వర్డ్‌ను సేవ్ చేసుకోవాలి. HRMS ID అనేది మీరు లాగిన్ కావడానికి ఉపయోగించే ID అని గుర్తుంచుకోవాలి.
- ఇప్పుడు.. మళ్లీ లాగిన్ పేజీని ఓపెన్ చేసి.. మొదటిసారి లాగిన్ చేయడానికి HRMS IDని యూజర్ ఐడిగా Test@123ని పాస్‌వర్డ్‌గా నమోదు చేసి.. లాగిన్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని టైప్ చేసి.. 'Verify OTP' అనే దానిపై క్లిక్ చేయాలి.
- సరైన OTP నమోదు చేస్తే మీ వివరాలు ధ్రువీకరించబడతాయి. భారతీయ రైల్వే HRMS పోర్టల్‌లోకి లాగిన్ చేయబడతాయి.
- చివరగా మీరు HRMS పోర్టల్‌లోకి లాగిన్ అయ్యారు అనే సందేశం వస్తోంది.
How to Pensioners Register into HRMS Indian Railways :
HRMSలో పెన్షనర్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే విధానమిలా..
- పెన్షనర్స్ కూడా మొదటగా.. HRMS ఇండియన్ రైల్వేస్ వెబ్‌సైట్ https://indianrail.gov.in/HRMS/ను సందర్శించాలి.
- ఆ తర్వాత 'Retired Employees Registration' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు PPO(పెన్షన్ పేమెంట్ ఆర్డర్) నంబర్, దరఖాస్తుదారు పుట్టిన తేదీని అడుగుతుంది. వాటిని అక్కడ నమోదు చేయాలి.
- అనంతరం అక్కడ వచ్చిన సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత 'Go' బటన్‌పై క్లిక్ చేయాలి.
- అప్పుడు HRMS Id/లాగిన్ ID, ఉద్యోగి పేరు, Designation, మొబైల్ నంబర్ వంటి వివరాలు డిస్ ప్లే అవుతాయి.
- ఆ వివరాలు సరైనవో కాదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత HRMS IDని సేవ్ చేస్తే అది యూజర్ ఐడీగా ఉపయోగపడుతుంది.
- ఆపై మళ్లీ, మొదటిసారి లాగిన్ చేయడానికి HRMS ఇండియన్ రైల్వేస్ హోమ్ పేజీకి వెళ్లాలి.
- అప్పుడు ఉద్యోగి ఐడీ, డిఫాల్ట్ పాస్‌వర్డ్‌ను నమోదు చేసి "లాగిన్"పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు సిస్టమ్ రూపొందించిన OTP వస్తుంది. దానిని నమోదు చేయాలి.
- మీ మొబైల్ నంబర్ సరైనదైతేనే మీరు HRMS ఇండియన్ రైల్వే వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి మీకు కావాల్సిన సేవలను పొందుతారు.
How to Login HRMS Indian Railway use APAR Mobile Application :
APAR మొబైల్ అప్లికేషన్ ద్వారా HRMS ఇండియన్ రైల్వే పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడమెలా..?
- HRMS ఇండియన్ రైల్వేస్ అధికారిక అప్లికేషన్ "HRMS Employee Mobile App for I" అంటే.. HRMS రైల్వే APAR
- మొదట మీరు Google Play స్టోర్‌ని తెరిచి.. ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- అనంతరం మీ మొబైల్ ఫోన్‌లో అప్లికేషన్‌ను ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
- అనంతరం మీ మొబైల్ నంబర్‌ను HRMS మొబైల్ అప్లికేషన్‌తో లింక్ చేయాలి.
- లింక్‌ను నిర్ధారించడానికి మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తోంది. అప్పుడు ఇచ్చిన స్థలంలో అప్లికేషన్‌పై మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
- ఆ తర్వాత విజయవంతంగా లాగిన్ అయ్యాక.. మొబైల్ స్క్రీన్‌పై ఉద్యోగి లేదా పెన్షనర్ అన్నీ వివరాలు కనిపిస్తాయి.
- ఇలా ఉద్యోగులు మొబైల్ అప్లికేషన్‌లోని అన్ని సేవలను ఉపయోగించడానికి అనుమతి పొందుతారు.
Railway jobs 2023 : రైల్వేలో 790 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అప్లై చేసుకోండిలా!