ETV Bharat / bharat

How to Prepare Palak Prawns Curry : 'పాలక్ ప్రాన్స్ కర్రీ..' నోరూరిపోవాల్సిందే! - పాలక్ ప్రాన్స్ కర్రీ తయారీ విధానం

How to Makes Palak Prawns Curry : ప్రతి సండే చికెన్ లేదంటే.. మటన్ మాత్రమేనా! అప్పుడప్పుడూ వెరైటీగా ప్లాన్ చేస్తే సూపర్బ్ గా ఉంటుంది. పిల్లలు కూడా హ్యాపీగా ఫీలవుతారు. మరి, అలాంటి ఓ రెసిపీని ఇప్పుడు మనం ట్రై చేద్దాం.

Prawns
Palak Prawns
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 1:32 PM IST

How to Makes Palak Prawns Curry in Telugu : మాంసాహార ప్రియులకు సండే వచ్చిందంటే.. ఇంట్లో నాన్​వెజ్ ఉండాల్సిందే. ఒక రోజు ముందునుంచే ఈ ఆదివారం ఏ నాన్​వెజ్ కర్రీ చేసుకుందామని ఆలోచిస్తుంటారు. ఇక కొందరైతే ఏం వండుకుంటాంలే ఏదైనా మంచి రెస్టారెంట్​ నుంచి బిర్యానీ లేదా ఏదైనా నాన్​వెజ్ రెసిపీ ఆర్డర్ చేసుకుందామనుకుంటారు. అయితే.. ఈ సండే ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. అది కూడా.. రెగ్యులర్ చికెన్, మటన్ కాకుండా.. ఆరోగ్యానికి మేలు చేసే రొయ్యలు ఎంచుకోండి. అదికూడా.. పాలకూరతో కలిపి వండేద్దాం.

How to Prepare Spinach Prawns Curry : చాలా మంది చేపల కర్రీ(Fish Curry)ని ఈజీగా వండేస్తారు. కానీ ప్రాన్స్(రొయ్యల) విషయానికొస్తే కాస్త వెనకడుగు వేస్తారు. మనవల్ల కాదులే.. సరిగ్గా రాదేమోనని భావిస్తుంటారు. అలాంటి వారు, బ్యాచిలర్స్, మొదటిసారి చేసే వారు కూడా మేము చెప్పేది ఫాలో అయితే చాలా సింపుల్​గా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే నోరూరించే పాలక్ ప్రాన్స్ కర్రీ ట్రై చేసేయండి.. ఇంటిల్లి పాది కూర్చొని లొట్టలేసుకుంటూ లాగించండి.

Required Ingredients for Spinach Prawns Curry :

పాలక్ ప్రాన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు :

  • రొయ్యలు(ప్రాన్స్)- 200 గ్రా., (పొట్టు తీసి శుభ్రం చేసుకున్నవి)
  • పాలకూర తరుగు- రెండు కప్పులు
  • ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరగాలి)
  • పచ్చిమిర్చి- రెండు (సన్నగా తరగాలి)
  • నూనె- సరిపడా
  • అల్లం వెల్లుల్లి పేస్టు- రెండు చెంచాలు
  • పసుపు- చిటికెడు
  • కారం, ధనియాల పొడి- చెంచా చొప్పున
  • గరంమసాలా- చెంచా.
  • ఉప్పు- రుచికి తగినంత

How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!.!

Palak Prawns Curry Cooking Process :

పాలక్ ప్రాన్స్ కర్రీ తయారీ విధానం : ముందుగా ఒక పాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. ఆ తర్వాత పొట్టు తీసుకుని పెట్టుకున్న రొయ్యల్ని వేసి పచ్చివాసన పోయేవరకు చిన్నమంటపై వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్​లో మరికొద్దిగా నూనె వేసి పైన పేర్కొన్న విధంగా.. తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఇలా వేగిన మిశ్రమంలోనే ముందుగా మీరు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు, కారం, ధనియాల పొడి కలిపి మరికాసేపు దానిని మగ్గించాలి.

ఆ తర్వాత అలా మగ్గిన మిశ్రమంలో పాలకూర తరుగు, ఉప్పు వేసి మూతపెట్టాలి. పాలకూర కాస్త మగ్గిన తర్వాత దానిలో కప్పు నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి(ఇక్కడ పాలకూర తరుగు బదులు మీరు ముందుగానే దాన్ని ఉడికించి పేస్ట్ చేసి కూడా కలపొచ్చు). రొయ్యలు ఉడికి కూర కాస్త చిక్కబడ్డాక తగినంత గరంమసాలా పొడి వేసి దించేయాలి. అంతే నోరూరించే పాలక్ ప్రాన్స్ రెసిపీ రెడీ. ఈ కర్రీని వేడి వేడి అన్నంతో లేదా చపాతీలతో తింటే మరింత రుచి మీ సొంతం. ఆలస్యమెందుకు ఈ సండే పాలకూర రొయ్యల కర్రీతో ఎంజాయ్ చేసేయండి.!

How to Make Chepala Pulusu in Telugu: చేపల పులుసు ఇలా చేశారంటే.. గిన్నె ఊడ్చాల్సిందే..!

సండే స్పెషల్​ 'మండీ' బిర్యానీని ఇంట్లో చేసుకోండిలా.

Chicken Snacks Recipes : సండే స్పెషల్.. చికెన్ స్నాక్స్ చేసేద్దామా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.