ETV Bharat / bharat

బీట్‌రూట్‌ రైస్‌ను ఇలా చేసారంటే, పిల్లలతో పాటు పెద్దలు అస్సలు వదలరు!

How To Prepare Beetroot Rice : బీట్‌రూట్‌లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే దీనిని నేరుగా తినడం ఇష్టంలేని వారి కోసం ఒక మంచి రెసిపీ ఉంది, అదే బీట్‌రూట్ రైస్‌. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Prepare Beetroot Rice
How To Prepare Beetroot Rice
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2023, 9:59 AM IST

How To Prepare Beetroot Rice : బీట్‌రూట్‌ను తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలుంటాయని తెలిసినా కూడా కొంత మంది దీనిని తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ బీట్‌రూట్‌ను తినిపించడం మమ్మీలకు పెద్ద సాహసమవుతుందనే చెప్పాలి. అయితే, ఈ బీట్‌రూట్‌ను నేరుగా తీసుకోకుండా ఉండే వారికి బీట్‌రూట్‌ రైస్‌ను చేసి తినిపించండి. చాలా తక్కువ మసాలాలతో ఉండే ఈ రైస్‌ పిల్లల లంచ్‌ బాక్స్‌లోకైనా, లేదా మధ్యాహ్నా భోజనంలోకి సరిగ్గా సరిపోతుంది. ఎన్నో రకాల పోషకాలతో పాటు, టేస్టీగా ఉండే బీట్‌రూట్‌ రైస్‌ను తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే, ఇప్పుడు ఇంట్లో ఈ బీట్‌రూట్‌ రైస్‌ను ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి..!

బీట్‌రూట్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • 2 కప్పులు పొడిగా ఉడికించుకున్న రైస్‌.
  • 2 బీట్‌రూట్లను తీసుకుని వాటిని సన్నగా తురుముకోవాలి.
  • 2 టమాటాలు, సన్నగా కట్‌ చేసుకోవాలి.
  • పావు కప్పు పచ్చి బటానీలు (ఆప్షనల్).
  • సగం కప్పు తరిగిన ఉల్లిపాయలు
  • 2 పచ్చిమిర్చి.
  • పావు చెంచా జీలకర్ర.
  • పావు చెంచా ఆవాలు
  • 1 కరివేపాకు రెబ్బ
  • సగం చెంచా అల్లం తురుము
  • 1 చెంచా సాంబార్ పొడి
  • సగం చెంచా పసుపు
  • పావు చెంచా యాలకుల పొడి
  • ఉప్పు తగినంత
  • 2 చెంచాల నూనె
  • 1 చెంచా నెయ్యి
  • కొత్తిమీర తరుగు

సంక్రాంతి స్పెషల్​: ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.!

బీట్‌రూట్ రైస్‌ను ఎలా చేయాలంటే :

  • ముందుగా బీట్‌రూట్‌ రైస్‌ను చేయడానికి మిగిలిపోయిన అన్నాన్ని గానీ, లేదా వేడి వేడి అన్నాన్ని తీసుకోండి.
  • తరవాత స్టావ్‌ను వెలిగించుకొని, ఒక కడాయిని పెట్టుకోండి.
  • కడాయి వేడెక్కిన తరవాత అందులోకి టీ స్పూన్‌ నూనె, టీ స్పూన్ నెయ్యి వేసుకోండి.
  • తరవాత అందులోకి ఆవాలు, జీలకర్ర వేసుకుని చిటపటలాడనివ్వాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కాస్త రంగు మారేదాకా వేగనివ్వాలి.
  • తరవాత అందులోకి బటానీ, టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే పసుపు, కొద్దిగా సాంబార్ పొడి వేసుకుని కలుపుకోవాలి.
  • ఇప్పుడు కడాయిలోని టమాటాలు కాస్త మెత్తబడ్డాక బీట్‌రూట్ తురుము, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇలా కలిపేటప్పుడు మంట సన్నగా పెట్టుకోని, మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి.
  • టమాటాలు పచ్చివాసన పోయి కాస్త మెత్తబడ్డాక యాలకుల పొడి, కొత్తిమీర తరుగు వేసుకోవాలి.
  • తరవాత ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న అన్నం వేసి కలుపుకోవాలి.
  • అన్నం మిశ్రమం బాగా కలిసిన తరవాత ఒక నిమిషం పాటూ మూత పెట్టి స్టవ్ ఆఫ్‌ చేయాలి.
  • అంతే, ఈ బీట్‌రూట్‌ రైస్‌ను రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.

ఈ చలిలో మటన్ పాయా.. సూప్ జుర్రేస్తే జిందగీ ఖుష్ అవ్వాల్సిందే!

How to Prepare Gongura Mutton Curry : గోంగూర మటన్ కర్రీ ఇలా ట్రై చేయండి.. ఎవరైనా ఫిదా అయిపోతారు!

చికెన్‌ కూరలు.. కమ్మగా, కారంగా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.