ETV Bharat / bharat

How to Participate PNB E-Auction 2023 : అతి తక్కువ ధరకు ఇల్లు కావాలా..? బ్యాంకు వేలం వేస్తోంది..! - పంజాబ్ నేషనల్ బ్యాంక్ వేలం ఎప్పుడు ప్రారంభం

PNB E-Auction 2023 : సొంత ఇల్లు అనేది ప్రతీ మనిషి స్వప్నం. కానీ.. కొందరికి మాత్రమే ఈ కల సాకారమవుతుంది. అయితే.. ఓ ఛాన్స్ ఇస్తామంటోంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB). నచ్చిన ఇంటి సొంతం చేసుకోవచ్చు రండి అని పిలుస్తోంది. మరి, ఆ విషయమేంటో మీరూ తెలుసుకోండి.

How to Participate PNB E-Auction 2023
How to Participate PNB E-Auction 2023
author img

By

Published : Aug 13, 2023, 11:05 AM IST

Punjab National Bank E-Auction : సొంత ఇల్లు అనేది ప్రతీ మనిషి స్వప్నం. కానీ.. కొందరికి మాత్రమే ఈ కల సాకారమవుతుంది. మధ్యతరగతి జనం ఒక ఇల్లు కొనుగోలు చేయాలనే టార్గెట్ పెట్టుకొని.. రూపాయి రూపాయి కూడబెట్టి.. హమ్మయ్యా డబ్బు కూడబెట్టాం.. ఇక ఇల్లు కొనాలని చూసేసరికి.. ధర ఎప్పుడో మరింత పైకి వెళ్లిపోయి ఉంటుంది. చాలా మంది విషయంలో ఇదే పరిస్థితి పునరావృతం అవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సొంత ఇల్లు అనే కోరిక పగటి కలగానే మిగిలిపోతుంది చాలా మందికి.

తనఖా ఆస్తుల వేలం :

Auction of mortgaged properties : ఇలాంటి వారికి సువర్ణ అవకాశం అందిస్తోంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB). తన వద్ద ఉన్న తనఖా ఆస్తులను ఆన్ లైన్లో వేలం వేస్తోంది. ఇందులో ఇండిపెండెంట్ ఇళ్లు మొదలు.. భారీ కమర్షియల్ కాంప్లెక్సుల వరకూ ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే ఆగస్టు 3న తొలి దశ వేలం నిర్వహించిన పీఎన్​బీ .. ఇప్పుడు ఆగస్టు 22న రెండో విడత వేలం వేసేందుకు సిద్ధమవుతోంది. మరి, మీరు కూడా ఇ-వేలంలో పాల్గొంటారా..? మీకు నచ్చిన ఆస్తిని కొనుగోలు చేస్తారా..? అయితే.. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

How to Earn Money as a Student : చదువుకుంటూనే సంపాదించాలా..? ఎన్ని మార్గాలున్నాయో..!

రెండో విడత వేలం :

Second Phase Auction : పంజాబ్ నేషనల్ బ్యాంక్ (Punjab National Bank).. ఆగస్టు 3న మొదలు పెట్టిన వేలంలో 952 నివాస ఆస్తులు, 361 వాణిజ్య ఆస్తులు, 83 ఇండస్ట్రియల్ ఆస్తులను వేలం వేసింది. ఆగస్టు 22న నిర్వహించనున్న వేలంలో ఎన్ని ఆస్తులు ఉంటాయో వెబ్ సైట్లో వివరించింది. PNB వెబ్‌సైట్ ప్రకారం.. రెండో విడత వేలం నాటికి 2,662 నివాస ఆస్తులు, 673 వాణిజ్య, 235 ఇండస్ట్రియల్ ఆస్తులు వేలానికి రాబోతున్నాయి. ఈ మేరకు PNB ఓ ట్వీట్ కూడా చేసింది. "మీకు నచ్చిన ఆస్తిని పొందే.. మెగా అవకాశాన్ని జారవిడుచుకోకండి. ఈ వేలంలో పాల్గొనేందుకు https://ibapi.in ను సందర్శించండి" అని పేర్కొంది. IBAPI (Information on Auction Properties of Indian Banks.) పోర్టల్ అనేది.. తనఖా పెట్టిన ఆస్తుల వివరాలను ప్రదర్శించే అఫీషియల్ వెబ్ సైట్.

ట్విట్టర్​తో డబ్బు సంపాదించేందుకు రెండు ఈజీ మార్గాలు.. మస్క్ బంపర్ ఆఫర్!

ఈ వేలంలో పాల్గొనడానికి ఇవి కావాలి..

  • PNB వేలం ప్రక్రియలో ఎవరైనా పాల్గొనవచ్చు.
  • ఈ మెగా e-వేలంలో పాల్గొనాలని భావించేవారు.. అవసరమైన KYC పత్రాలను సిద్ధం చేసుకోవాలి.
  • పాన్ కార్డ్ లేదా ఫారం 16ను జతచేయాల్సి ఉంటుంది.
  • నివాస ధ్రువీకరణ పత్రం, ఓటర్ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, జనాభా రిజిస్టర్ ద్వారా జారీ చేయబడిన లేఖ కూడా సిద్ధం చేసుకోవాలి.

ఆ తర్వాత ఇవి చేయాలి..

  • బిడ్డింగ్ వేసే వారు తమ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడిని ఉపయోగించి.. ఇ-వేలం ప్లాట్‌ఫామ్​లో పేరు నమోదు చేసుకోవాలి.
  • సిద్ధం చేసుకున్న KYC పత్రాలను అప్‌లోడ్ చేయడానికన్నా ముందుగా.. ఈ KYC పత్రాలను e-వేలం సర్వీస్ ప్రొవైడర్ కు పంపించాలి.
  • సర్వీస్ ప్రొవైడర్ వీటిని ధ్రువీకరించిన తర్వాత వీటిని అప్ లోడ్ చేయాలి. ఇందు కోసం సుమారు 2 వర్కింగ్ డేస్ పట్టొచ్చు.
  • ఆన్ లైన్ ద్వారా చలానా చెల్లించాలి.
  • ఈ దశలన్నీ పూర్తిచేసిన తర్వాత.. ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
  • ఈ వేలం ప్రక్రియలో వారికి.. ప్రస్తుత మార్కెట్ రేటు కన్నా చాలా తక్కువ ధరకే.. ఆస్తులను సొంతం చేసుకునే వీలుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అందువల్ల.. అవకాశం ఉన్నవారు తప్పకుండా Punjab National Bank వేలంలో పాల్గొని కలలు సాకారం చేసుకోవాలని సూచిస్తున్నారు.

​గవర్నమెంట్ జాబ్ వదిలేసిన యువతి.. ఆ వీడియోస్​తో లక్షల్లో సంపాదన

Triguni EzE Eats Story: వయసు డెబ్భై.. సంపాదన రూ. కోట్లలో...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.