ETV Bharat / bharat

బంగాళాదుంపలు అంటే ఇష్టమా? ఈ టిప్స్ పాటిస్తూ ఇంట్లోనే ఈజీగా పెంచుకోండి! - Grow Potatoes Tips

Tips for Grow Potatoes at Home : మీకు బంగాళదుంపలతో చేసిన వంటకాలు లేదా చిప్స్ అంటే చాలా ఇష్టమా? మార్కెట్​లో దొరికేవి ఫ్రెష్​వో కాదో అని భయమా? అయితే ఇది మీకోసమే. మార్కెట్​కు వెళ్లకుండా మీరే ఇంటి దగ్గర బంగాళదుంపలను ఈ టిప్స్ పాటిస్తూ ఈజీగా పెంచుకోవచ్చు తెలుసా? అందుకోసం ఎక్కువ శ్రమించాల్సిన పని కూడా లేదు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

Potatoes
Potatoes
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 11, 2024, 3:44 PM IST

Best Tips for Grow Potatoes at Home : బంగాళదుంపలు.. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన కూరగాయలలో ఒకటి. వీటితో టేస్టీ కర్రీలు, ఫ్రై, చిప్స్, ఆలు బిర్యానీ, గ్రేవీ.. ఇంకా ఎన్నో వెరైటీలు తయారుచేసుకుంటాం. ఇక పిల్లలయితే బంగాళదుంప వంటకాలు, చిప్స్​నూ మహా ఇష్టంగా తింటుంటారు. వారంలో కనీసం రెండు సార్లు అయినా వీటిని ప్రతీ ఇంట్లో వండుకుంటారు. అలాగే మిగతా కూరగాయల కంటే వీటిని ఎక్కువ కాలం కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఆలుగడ్డలు కావాలంటే మార్కెట్​కు వెళ్లి తెచ్చుకోవాలి. అలా కాకుండా ఇంట్లోనే వీటిని పండించుకోవచ్చని మీకు తెలుసా? అందుకోసం ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం ఇంట్లోనే ఖాళీ స్థలం లేదంటే టెర్రస్ మీద ప్లేస్ ఉంటే అక్కడ ఈ టిప్స్ పాటిస్తూ ఈజీగా బంగాళదుంపలను పండించుకోవచ్చు. అది ఎలాగంటే..

సరైన విత్తనాలను ఎంచుకోవడం : ఇంట్లో బంగాళాదుంపలను పెంచాలనుంకుంటే మీరు మొదట పరిగణనలోకి తీసుకోవాల్సి ముఖ్యమైన విషయాలలో ఒకటి.. విత్తనాల ఎంపిక. ఇంటి వద్ద ఈ దుంపలను పండించడానికి సరైన విత్తనాలను మాత్రమే ఉపయోగించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అయితే విత్తనాలు లేకుండా కూడా బంగాళాదుంపలను పండించవచ్చు. అందుకోసం మీరు కొన్ని బంగాళాదుంపలను మట్టిలో నాటి నీళ్లు పోస్తూ ఉండాలి. కొన్ని రోజులకు దాని నుంచి తెల్లటి మొలకలు వస్తాయి. అప్పుడు అవి ఇంట్లో అలుగడ్డలను పండించడానికి సహాయపడుతాయి. లేదంటే ఒకవేళ మీ ఇంట్లో తెల్లటి మొలకలు వచ్చినవి ఉంటే వాటిని డైరెక్ట్​గా మట్టిలో పాతిపెట్టవచ్చు.

సరైన మట్టిని ఎంచుకోవడం : మీరు ఇంట్లో అలుగడ్డలు పండించాలంటే సరైన మట్టిని ఎంచుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఏదైనా మొక్క సరిగ్గా పెరగాలంటే నేల చాలా ముఖ్యమైనది. ఈ క్రమంలో ఇంట్లో బంగాళాదుంపలను పెంచడానికి, కూరగాయలు సరిగ్గా పెరగడానికి సరైన మొత్తంలో ఎరువులు వేయాలి. అయితే వీటి పెంపకం కోసం 50 శాతం మట్టి, 30 శాతం వర్మీ కంపోస్ట్, 20 శాతం కోకో పీట్ ఉండేలా చూసుకోవాలి. అప్పుడు వాటన్నింటినీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని పెద్ద కుండలో ఉంచండి.

మొలకెత్తిన బంగాళదుంపలు తింటున్నారా..? అయితే జాగ్రత్త!

నాటేటప్పుడు ఈ జాగ్రత్తలు : ఇక తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే.. మొలకొచ్చిన బంగాళదుంపలను వాటి కళ్లు పైకి(తెల్లటి మొలకలు) ఉంచుతూ కుండ లేదా కంటైనర్​లో ఉంచిన మట్టిలో పాతి పెట్టండి. సుమారు 5 నుంచి 6 అంగుళాల లోతు, 12 - 15 అంగుళాల దూరం ఉండేలా వాటిలో మట్టిలో నాటండి. ఆ తర్వాత పై భాగంలో మట్టిని సరిగా అని కొద్దిగా నీరు పోయండి. వీటి పెంపకం కోసం మీరు గ్రో బ్యాగ్​లు, ఇంట్లో ఏదైనా బకెట్ లేదా కంటైనర్​ను కూడా యూజ్ చేయవచ్చు.

తేమ పరిమాణాన్ని చెక్ చేయడం : వ్యవసాయ నిపుణుల సలహాల ప్రకారం.. బంగాళదుంపలను పండించడానికి చల్లని వాతావరణం ఉత్తమం. అదే విధంగా మట్టిలో తేమ పరిమాణాన్ని తనిఖీ చేయడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ కూరగాయలను దెబ్బతీస్తుంది. అటువంటి పరిస్థితిలో మట్టిని చాలా తడిగా లేదా చాలా పొడిగా ఉంచుకునేలా చూసుకోవాలి. నీరు పోయడాన్ని కొనసాగించాలి. అంటే తరచుగా వాటర్ పోస్తుండాలి. కానీ మొత్తం కుండను లేదా కంటైనర్​ను నింపవద్దు. ఎందుకంటే అధిక నీరు పోస్తే ఆలుగడ్డలు త్వరగా కుళ్లిపోతాయి.

ఎరువులు వేయడం : ఇంట్లో బంగాళాదుంపల సాగు మంచిగా ఉండాలంటే మీరు తెలుసుకోవాల్సిన మరో విషయం.. ఎప్పటికప్పుడు ఎరువులు వేయడం. ఇలా వేయడం ద్వారా మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. కీటకాల బారి నుంచి రక్షించుకోవచ్చు. సాధారణంగా బంగాళదుంప మొక్క పెరగడానికి దాదాపు 2-3 నెలలు పడుతుంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. అవి పండిన తర్వాత ఎరువులు వేయకూడదు. సో.. చూశారుగా.. ఈ టిప్స్ పాటిస్తూ మీ ఇంట్లోనే ఆరోగ్యకరమైన బంగాళదుంపలను ఈజీగా పండించుకోవచ్చు.

potatoes milk: బంగాళాదుంప పాలు ఎప్పుడైనా టేస్ట్​ చేశారా..?

బంగాళదుంప చిప్స్.. మూత్రపిండాలను దెబ్బ తీస్తాయా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.