ETV Bharat / bharat

How to Find Blood Stock in Online : మీకు అత్యవసరంగా బ్లడ్​ కావాలా..? ఆన్​లైన్​లో​ పొందండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 5:10 PM IST

How to Find Blood Stock in Online : మన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కావొచ్చు.. అపరిచితులకు కావొచ్చు.. కొన్నిసార్లు అత్యవసరంగా రక్తం కావాల్సి ఉంటుంది. సరైన సమయంలో రక్తం అందుబాటులో లేకపోతే.. ఏకంగా ప్రాణాలే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే.. ఎవరెవరికో ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటాం.. ఇలాంటి వారు.. ఆన్​లైన్ ద్వారా బ్లడ్ స్టాక్ వివరాలు తెలుసుకోవచ్చని మీకు తెలుసా..?

How to Find Blood Stock in Online
Blood Stock in Online

Find Blood Banks in Online: కుటుంబ సభ్యులు, సన్నిహితుల కోసం.. రక్తం కావాలని అడిగే వారిని గమనిస్తూనే ఉంటాం. ఆస్పత్రి కారిడార్‌లో రక్తం కోసం ఆందోళన పడుతూ తిరిగే రోగి సంబంధీకులను చూస్తూనే ఉంటాం. ఒక్కొక్కసారి అరుదైన బ్లడ్​ గ్రూపులు దొరకడం కూడా కష్టంగా ఉంటుంది. అనుకోకుండా తలెత్తే అనారోగ్య పరిస్థితులు, ప్రమాదాలు ఏర్పడినప్పుడు రక్తం కోసం ఎక్కడకు వెళ్లాలి? ఎవరిని సంప్రదించాలి? అనే విషయం గురించి చాలా మందికి తెలియదు. అలాంటి వారు.. ఆన్​లైన్​లో ఎలా బ్లడ్ సేకరించాలో ఈ స్టోరీలో చూద్దాం.

సాధారణంగా పేటీఎం లో బిల్లులు పే చేయడం, మనీ ట్రాన్స్​ఫర్​, లోన్స్​ తీసుకోవడం, టికెట్​ బుకింగ్​, ఇన్సూరెన్స్​, గేమ్స్​ ఆడుకోవడం లాంటి ఫీచర్ల గురించి అందరికీ తెలుసు. అయితే.. ఇదే పేటీఎం ను ఉపయోగించి.. ఏయే బ్లడ్​ బ్యాంకుల్లో.. ఎంత మోతాదులో బ్లడ్​ అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చు. అంతే కాకుండా మెడిసిన్స్​ ఆర్డర్ చేయడం, ల్యాబ్ పరీక్షలను బుకింగ్ చేయడం, వ్యాక్సిన్ బుకింగ్ పబ్లిక్ హెల్త్ యాప్‌లను యాక్సెస్ చేయడం వంటి అనేక రకాల ఆరోగ్య సంబంధిత సేవల గురించి తెలుసుకోవచ్చు.

పేటీఎం ఉపయోగించి బ్లడ్​ బ్యాంకులకు కనెక్ట్​ అవ్వడం ఎలానో ఇప్పుడు చూద్దాం..

How to Connect to Blood Banks Through Paytm:

  • ముందుగా మీ ఫోన్​లో Paytm App ఓపెన్​ చేయండి.
  • యాప్​ను కిందకు స్క్రోల్​ చేసి.. Do More With Paytm ఆప్షన్​లో Paytm Health బటన్​పై క్లిక్​ చేయండి.
  • ఆ తర్వాత Public Health Appsలో Blood Bank ఆప్షన్​ను ఎంచుకోండి.
  • అనంతరం సిటీ, బ్లడ్​ గ్రూప్​, బ్లడ్​ కాంపోనెంట్​ను సెలెక్ట్​ చేసుకుని Find Availability ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • మీరు ఎంచుకున్న బ్లడ్​ గ్రూప్​కు సంబంధించిన వివరాలు స్క్రీన్​ మీద కనిపిస్తాయి.
  • అంతే కాకుండా మరింత సమాచారం కోసం బ్లడ్ బ్యాంక్‌కు కాల్ చేయడం లేదా మెయిల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా సదరు బ్లడ్​ బ్యాంకుకు వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
  • అలాగే ‘షేర్’ బటన్‌ను నొక్కడం ద్వారా ఈ వివరాలను ఇతరులకు కూడా పంపవచ్చు.

e Raktkosh వెబ్​సైట్​ ద్వారా కూడా..

  • ఈ లింక్​ ద్వారా https://www.eraktkosh.in/BLDAHIMS/bloodbank/transactions/bbpublicindex.html సెర్చ్​ చేయండి.
  • పేజ్​ను కిందకు స్క్రోల్​ చేసి.. Blood Availability ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • తర్వాత State, District సెలెక్ట్​ చేసి Search ఆప్షన్​పై క్లిక్​ చేస్తే.. మీరు సెలెక్ట్​ చేసిన జిల్లాలో ఉన్న బ్లడ్​ బ్యాంకు వివరాలు, ఆ బ్లడ్​ బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న బ్లడ్​ గ్రూప్​ వివరాలు స్క్రీన్​ మీద కనిపిస్తాయి.

erakt kosh యాప్ ద్వారా..

  • ముందుగా గూగుల్​ ప్లే స్టోర్​కి వెళ్లి erakt kosh యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోండి.
  • అనంతరం యాప్​ ఓపెన్​ చేసి.. Blood Availability ఆప్షన్​పై క్లిక్​ చేసుకోండి.
  • తర్వాత సెర్చ్​ బార్​లోకి వెళ్లి.. తర్వాత State, District సెలెక్ట్​ చేసి Search ఆప్షన్​పై క్లిక్​ చేస్తే.. మీరు సెలెక్ట్​ చేసి జిల్లాలో ఉన్న బ్లడ్​బ్యాంకు వివరాలు, ఆ బ్లడ్​ బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న బ్లడ్​ గ్రూప్​ వివరాలు స్క్రీన్​ మీద కనిపిస్తాయి.
  • అంతే కాకుండా మరింత సమాచారం కోసం బ్లడ్ బ్యాంక్‌కు కాల్ చేయడం లేదా మెయిల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
  • లేదా సదరు బ్లడ్​ బ్యాంకుకు వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

డ్రోన్​ ద్వారా బ్లడ్​​ డెలివరీ.. దేశంలోనే తొలిసారి!

Blood Donation Camp: విద్యే కాదు.. సమాజ సేవ కూడా తెలుసు అంటున్న విద్యార్థులు

బ్లడ్‌ బ్యాంక్‌ పెట్టడానికి కారణమదే.. త్వరలో ఆసుపత్రి నిర్మాణం: చిరంజీవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.