How to Download Masked Aadhaar Card Online : దేశంలో ప్రతి భారతీయుడికీ అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా ఆధార్ మారిపోయింది. ప్రభుత్వ రాయితీలతో పాటు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఏ సంక్షేమ పథకం ప్రయోజనాలు పొందాలన్నా.. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే! ఇంతేనా..? బ్యాంక్ అకౌంట్ నుంచి.. ల్యాండ్ రిజిస్ట్రేషన్ దాకా.. ప్రభుత్వ ఆఫీసుల్లో ఎలాంటి సేవలు పొందాలన్నా.. ఆధార్ నంబర్ తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆధార్ నంబర్ భద్రత విషయంలో మీరు ఎంత అప్రమత్తంగా ఉన్నారు..?
Masked Aadhaar Card Details in Telugu : చాలామంది ఆధార్ కార్డు వినియోగదారులు అనేక ఆన్లైన్ మోసాలకు గురవుతుండడం ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. అందుకే ఆధార్ కాపీలను ఎక్కడపడితే అక్కడ ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో ఈ ఆధార్ కార్డుకు మరింత భద్రతను పెంచుతూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ అఫ్ ఇండియా(యూఐడీఏఐ) మాస్క్‌డ్ ఆధార్(Masked Aadhaar)ను ప్రవేశపెట్టింది. ఇంతకీ మాస్క్‌డ్ ఆధార్ అంటే ఏమిటి? దానిని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? ఎలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుంది? మాస్క్‌డ్ ఆధార్కీ.. సాధారణ ఆధార్‌కి తేడా ఏంటి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మాస్క్‌డ్ ఆధార్ అంటే..
What is Masked Aadhaar in Telugu : మాస్క్‌డ్ ఆధార్ కార్డులు సాధారణ ఆధార్ కార్డుల మాదిరిగానే ఉంటాయి. అయితే.. UIDAI ప్రవేశపెట్టిన ఈ మాస్క్‌డ్ ఆధార్‌లో నంబర్లన్నీ కనిపించవు. మామూలు ఆధార్‌లో ఉన్నట్లే ఇందులోనూ12 నంబర్లు ఉంటాయి. అయితే.. ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుంటే అందులోని మొదటి ఎనిమిది నంబర్లు XXXX-XXXX ఇలా ఇంటూ మార్క్‌తో కనిపిస్తాయి. అంటే.. ఆ నంబర్లకు మాస్క్ వేశామన్నమాట. చివరి నాలుగు నంబర్లు మాత్రమే మనకు కనిపిస్తాయి. మాస్క్‌డ్ ఆధార్, సాధారణ ఆధార్(Aadhaar Card) మధ్య ఉన్న ఏకైక ముఖ్యమైన వ్యత్యాసం ఇదే.
వాటికి పనికి రాదు..
ఈ మాస్క్‌డ్ ఆధార్ కొన్ని చోట్ల పనిచేయదు. ఉదాహరణకు ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలను పొందేచోట ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డును ఉపయోగించలేరు. అలాంటి సందర్భాల్లో మీ సాధారణ ఆధార్‌నే ఉపయోగించి ప్రయోజనాలు పొందాలి. మరి, ఈ కార్డు ఎక్కడ పనిచేస్తుంది? దాని ప్రయోజనాలు ఏంటి అన్నది చూద్దాం.
మీ ఆధార్‌లో అడ్రస్ మార్చాలనుకుంటున్నారా?.. ఇక చాలా ఈజీ!
ఈ మాస్క్‌డ్ ఆధార్ కార్డను ఎక్కడ ఉపయోగించవచ్చంటే..
Masked Aadhaar Card Benefits in Telugu : కేవైసీ అవసరాల కోసం మీ ఆధార్ అడుగుతుంటారు. ఉదాహరణకు క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే అక్కడ కేవైసీ అడుగుతారు. ఇలా.. ఆన్‌లైన్‌లో పలు సేవల్లో KYC అవసరం కోసం ఆధార్ అడుగుతారు. ఇందుకోసం మీరు పూర్తి ఆధార్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చివరి నాలుగు అంకెలు సరిపోతాయి. అలాంటి చోట్ల.. ఈ మాస్క్‌డ్ ఆధార్ ఇస్తే సరిపోతుంది. ఎక్కువ మోసాలు జరిగేది ఆన్లైన్లోనే అన్న సంగతి తెలిసిందే. అందువల్ల.. ఇలాంటి చోట్ల మాస్క్‌డ్ ఆధార్ ఇస్తే ఏ చింతా లేకుండా ఉండొచ్చు. అందుకే.. కేంద్ర ప్రభుత్వం మాస్క్‌డ్ ఆధార్‌ను ప్రవేశపెట్టి సైబర్ నేరాల నుంచి రక్షణ కల్పిస్తోంది.
How to Download Masked Aadhaar in Online :
ఆన్‌లైన్‌లో మాస్క్‌డ్ ఆధార్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
- మొదట మీరు https://uidai.gov.in/ UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- పేజీ ఎగువన ఉన్న 'My Aadhaar' అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి.. ఎంపికల జాబితా నుంచి 'Download Aadhaar'పై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీరు మీ ఆధార్ నంబర్, ఎన్‌రోల్‌మెంట్ ID లేదా వర్చువల్ IDని నమోదు చేయడం ద్వారా ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- వివరాల్లో ఒకదాన్ని నమోదు చేసి 'Captcha' కోడ్‌ను ఇన్‌పుట్ చేయాలి. ఆ తర్వాత 'Send OTP' బటన్‌పై క్లిక్ చేయాలి.
- మీరు ఆ ఆప్షన్‌పై క్లిక్ చేసిన వెంటనే.. మీకు 'Download Masked Aadhaar' కోసం చెక్ బాక్స్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTPవస్తుంది. దానిని అక్కడ నమోదు చేయాలి.
- ఈ తర్వాత మీరు 'Download File' డైలాగ్ బాక్స్‌ను పొందుతారు. ఆపై మీరు మాస్క్ చేసిన ఆధార్‌ను మీ కంప్యూటర్‌లో సేవ్ చేసుకోవచ్చు.
- అలా మీ మాస్క్‌డ్ ఆధార్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటుంది. పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
- ఈ ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసిన తర్వాత దాని పాస్‌వర్డ్ మీ ఈ -మెయిల్‌కి వస్తుంది. దాంతో మీ మాస్క్‌డ్ ఆధార్‌ను సింపుల్‌గా వాడుకోవచ్చు.
ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ తెలియదా?.. చెక్ చేసుకోండిలా!
How to Apply Blue Aadhaar Card : చిన్నపిల్లల కోసం 'బ్లూ ఆధార్' కార్డులు.. ఇలా అప్లై చేసుకోండి.!