How To Decorate Pooja Room At Home : హిందువులు తమ ఇంట్లో దేవుడి పూజకోసం ప్రత్యేకంగా ఓ గది ఏర్పాటు చేసుకుంటారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారైతే.. బిల్డర్లకు ప్రత్యేకంగా సూచనలు చేస్తారు. అన్నీ వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు. అయితే.. ఆ పూజగదిలో కేవలం దేవుడి చిత్రాలు పెట్టి అలా వదిలేస్తుంటారు కొందరు. అలా కాకుండా.. పలు మార్పులు చేయడం ద్వారా.. పూజ గదిని మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
కొత్త ఇల్లు కట్టుకునే వారు..
- మన ఇంటి స్థలానికి అనుగుణంగా బిల్డర్ ఎన్ని ఇంటీరియర్ డిజైన్‌లు చూపించినా.. పూజ గది విషయంలో మాత్రం అందరూ తప్పకుండా వాస్తునే ఫాలో అవుతారు. వాస్తు ప్రకారం ఇంట్లో 'ఈశాన్యం' దిక్కున పూజ గది ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
- ఇక, పూజ గది పిరమిడ్ ఆకారంలో ఉంటే మంచిదని చెబుతున్నారు.
- ఇలా ఉండడం వల్ల.. పూజ గదిలో కాలు పెట్టగానే పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయని సూచిస్తున్నారు.
- ఇంట్లో మిగతా గదుల సీలింగ్ ఎంత ఎత్తులో ఉన్నా సరే.. పూజ గది సీలింగ్ మాత్రం తక్కువగా ఉండాలట.
- వీటితోపాటు పూజ గదిలో ఉండే దేవుళ్ల గ్రంథాలు, పూజ సామాగ్రి వంటి వాటిని సర్దుకోవడానికి రెండు కబోర్డ్‌లను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది.
- ఇక దేవుడి విగ్రహాన్ని ఏదో మూలకు పెట్టకుండా.. గదిలో మధ్యలో పెడితే ఆలయంలా కనిపిస్తుంది.
- పూజ గదికి లైట్ షేడ్స్ ఉన్న రంగులను ఎంపిక చేసుకోవాలి. లేత పసుపు, లేత గులాబీ రంగు వేసుకుంటే చూడ్డానికి చక్కగా ఉంటుంది.
- పూజ గదిలో దేవుడిని ఆరాధించడంతో పాటు కొందరు మెడిటేషన్ చేస్తారు. కాబట్టి, గదికి మంచి వెలుతురు వచ్చేలా నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది.
- ఒకవేళ వెలుతురు వచ్చే ఛాన్స్ లేకపోతే.. మంచి ఎల్‌ఈడీ లైట్‌లను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది.
కార్తికమాసం స్పెషల్ - ఉసిరి-గోధుమరవ్వ పులిహోరతో స్వామివారికి నైవేద్యం పెట్టండి!
ఉన్న పూజ గదికి కొత్త లుక్ వచ్చేలా..
- ఇప్పటికే ఇంట్లో పూజగదిని నిర్మించి ఉన్నట్టయితే.. దాన్ని ఎలా మేకోవర్ చేసుకోవాలో చూద్దాం.
- మార్కెట్లో పీవీసీ షీట్స్ దొరుకుతాయి. వీటిని పలు డిజైన్లలో కట్ చేసి.. గోడలకు అతికించండి.
- ఇవి తక్కువ ఖర్చుతోనే.. మంచి పాజిటివ్ వైబ్రేషన్స్‌ను కలిగిస్తాయి.
- పూజ గదిలోకి ఇత్తడి వస్తువులను కొనుగోలు చేయండి.
- వేలాడే గంటలు, ఇత్తడి కుందుల్లాంటివి పూజ గదికి మరింత అందాన్ని తీసుకువస్తాయి
- పూజ చేసే సమయంలో ఆయిల్ డిఫ్యూజర్‌లో కర్పూరం, ఎసెన్సియల్ ఆయిల్‌లను వేసి వేడి చేసుకోండి.
- వీటి నుంచి వచ్చే పరిమళం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది.
- పూజ గదిలో వెండి లేదా రాగి ఫ్రేమ్ తో తయారు చేసిన దేవుడి ఫొటోలను ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
- ఈ టిప్స్‌తో పూజ గదిని మరింత అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవచ్చు.
కార్తికమాసంలో ఏ దేవుళ్లను పూజించాలి? - పండితులు ఏం చెబుతున్నారు?
భక్తులకు అలర్ట్ - కార్తిక మాసంలో శ్రీశైలం వెళ్తున్నారా? ఈ విషయం తెలియకపోతే ఇబ్బందే!