How to Apply TS ePASS Scholarship Procedure : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యను ప్రోత్సహించడానికి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఆఫ్ స్కాలర్‌షిప్స్(TS ePASS) కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. వివిధ రకాల ఫీజులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రిజర్వ్డ్ కోటాకు చెందిన విద్యార్థులకు.. ఆర్థిక సహాయం అందించడం ఈ కార్యక్రమం ప్రాథమిక ఉద్దేశం. TS ePASS(టీఎస్ ఈ-పాస్) అనే ఆన్లైన్ సిస్టమ్‌లో ప్రతి సంవత్సరం విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటారు. అనంతరం వారి దరఖాస్తులను స్వీకరించి ఆయా విద్యాసంవత్సరానికి సంబంధించిన స్కాలర్‌షిప్ నిధులను మంజూరు చేస్తోంది.
TS ePASS Scholarship Apply Procedure : అలాగే UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలు, రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలు, ఇతర పోటీ పరీక్షల కోసం ఉచిత కోచింగ్ ప్రోగ్రామ్స్ కోసం అప్లికేషన్స్ స్వీకరిస్తోంది. మీరు వాటి కోసం నమోదు చేసుకోవడానికి http://tsstudycircle.co.in వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఇక్కడ మనం.. TS ePASS స్కాలర్‌షిప్ పొందాలంటే ఏయే ఏయే అర్హతలుండాలి? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? స్కాలర్‌షిప్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ? వంటి వివరాలను చూద్దాం..
TS ePASS Scholarship Eligibility Criteria :
టీఎస్ ఈపాస్ స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హత ప్రమాణాలివీ..
- కుటుంబ వార్షికాదాయం 2లక్షల రూపాయలు, అంతకన్నా లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విద్యార్థులు
- కుటుంబ వార్షికాదాయం 1.5 లక్షల రూపాయలు, అంతకంటే తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంత బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు
- కుటుంబ వార్షికాదాయం 2 లక్షల రూపాయలు, అంతకన్నా తక్కువ ఉన్న పట్టణ ప్రాంత బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులు
- కుటుంబ వార్షికాదాయం 1 లక్ష రూపాయల కంటే తక్కువ లేదా సమానంగా ఉన్న దివ్యాంగ విద్యార్థులు
- ఈబీసీ విద్యార్థులు కార్పొరేట్ కాలేజీ అడ్మిషన్ల పథకం కింద ఎంపికైతే.. వారు ఇంటర్మీడియట్ కోర్సులకు అర్హులు
- ప్రతీ త్రైమాసికం చివరిలో 75 శాతం కంటే ఎక్కువ హాజరు పొందిన విద్యార్థులు.. అలాగే తదుపరి విద్యా సంవత్సరానికి అర్హత పొందిన వారు ఈ స్కాలర్‌షిప్ రెన్యూవల్ కు అర్హులు
How to Apply TS ePASS Scholarship :
టీఎస్ ఈపాస్ స్కాలర్‌షిప్ దరఖాస్తు విధానమిదే..
- మొదట తెలంగాణ ఈపాస్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి
- అనంతరం విద్యార్హత ప్రకారం మీ స్కాలర్‌షిప్ రకాన్ని ఎంచుకోవాలి
- ఆ తర్వాత 'Fresh Registration' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
- అప్పుడు మీ బ్రౌజర్లో అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది
- అక్కడ అడిగిన పూర్తి వివరాలను నమోదు చేసి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి
- చివరగా.. అప్లికేషన్లో నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "Submit" చేయాలి
- అనంతరం అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకొని, భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి
- నోట్ : మీరు స్కాలర్‌షిప్‌ను రిన్యూవల్ చేసుకోవాలంటే కూడా పైన పేర్కొన్న విధంగానే అప్లికేషన్ చేసుకోవాలి.
విద్యార్థులకు శుభవార్త.. ఉపకార వేతనాలకు కుటుంబ వార్షికాదాయం పెంపు
How to Check TS ePASS Scholarship Status :
టీఎస్ ఈపాస్ స్టేటస్ చెక్ చేసుకోవడమెలా..?
- మొదట తెలంగాణ ఈపాస్ అధికారిక వైబ్సైట్కి వెళ్లాలి
- అనంతరం అక్కడ మీకు సంబంధించిన స్కాలర్‌షిప్ పేజీకి వెళ్లి 'Know Your Application Status' పై క్లిక్ చేయాలి
- మీ అప్లికేషన్ వివరాలు టైప్ చేసి.. 'Get Status' పై క్లిక్ చేయాలి
- చివరగా మీకు కావాల్సిన TS ePASS స్కాలర్‌షిప్ స్టేటస్ స్క్రీన్‌పై డిస్ప్లే అవుతుంది
Reasons for Rejecting TS ePASS Status :
మీ స్కాలర్‌షిప్ అప్లికేషన్ రిజక్ట్ అవ్వొచ్చు.. కారణాలివే..
- తప్పుడు ఆదాయ, కుల సమాచారాన్ని అందించడం
- సంవత్సరం అధ్యయనం లేదా కోర్సు సమాచారాన్ని తప్పుగా అందించడం
- అప్లికెంట్ బోనఫైడ్ విద్యార్థి కాకపోవడం
- కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని సరిగ్గా అప్లోడ్ చేయకపోవడం
- మేనేజ్మెంట్ కోటా కింద దరఖాస్తుదారుడు ప్రవేశం పొందడం
- దరఖాస్తుదారుని పునరుద్ధరణ.. ప్రతిపాదనకు అందకపోవడం
- ఫీల్డ్ ఆఫీసర్ ఇచ్చిన సిఫార్సు లేకపోవడం.. అదే కోర్సు స్థాయికి దరఖాస్తుదారుడు స్కాలర్‌షిప్‌ను క్లెయిమ్ చేయడం
- కళాశాల నుంచి విద్యార్థి డిటెయిన్డ్ కావడం
అప్లికేషన్ నంబర్ మరిచిపోతే ఎలా..?
How to get Forget TS ePASS Scholarship Number :
- మీ స్కాలర్ షిప్ స్టేటస్ తెలుసుకోవాలంటే కచ్చితంగా దరఖాస్తు సమయంలో మీకు వచ్చిన అప్లికేషన్ రిఫరెన్స్ నంబరు అవసరం. ఒకవేళ ఆ నంబరు మర్చిపోతే ఎలా కనుగోనాలో చూద్దాం...
- మొదట టీఎస్ ఈపాస్ అధికారిక వైబ్సైట్లోకి వెళ్లాలి
- అక్కడ హోం పేజీలో 'Know Your Application Number' ఆప్షన్ మీద క్లిక్ చేయాలి
- అనంతరం వచ్చే పేజీలో మీ SSC హాల్ టికెట్ నంబరు, విద్యా సంవత్సరం, పాస్ అయిన ఏడాది, పుట్టిన తేదీ, పదో తరగతి పాస్ అయిన రకాన్ని నమోదు చేయాలి
- చివరగా వివరాలను Submit చేస్తే మీ అప్లికేషన్ నంబరు వస్తుంది
ఒకవేళ మీరు TS ePASS స్టేటస్‌పై ఫిర్యాదు చేయాలనుకుంటే..
- మొదట TS ePASS వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి
- అక్కడ హోం పేజీలో 'Grievance' అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి
- అనంతరం 'New Grievance Registration' ఆప్షన్ పై క్లిక్ చేయాలి
- అక్కడ అడిగిన వివరాలను ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత వచ్చిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి
- చివరగా Submit బటన్‌పై క్లిక్ చేస్తే మీ ఫిర్యాదు స్వీకరించబడుతుంది
Income limit for Scholarships : ఏడేళ్లుగా పెరగని 'ఆదాయ పరిమితి'
ఈ అమ్మాయిలు అమెరికాలో అడ్మిషన్ మాత్రమే కాదు.. రూ. కోట్ల స్కాలర్ షిప్.. సాధించారు!