ETV Bharat / bharat

ఫ్రీగా అయోధ్య హారతి పాసులు- ఆన్​లైన్​లో ఇలా బుక్​ చేసుకోండి! - Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir Free Aarti Pass : అయోధ్య రామాలయంలో నిర్వహించే హారతి కార్యక్రమానికి హాజరు కావాలనుకునే భక్తులకు ఆలయ ట్రస్ట్ శుభవార్త చెప్పింది. ఈ హారతి పాస్‌లను ఆన్​లైన్​, ఆఫ్‌లైన్ రెండు రకాలుగా అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి వాటిని ఎలా బుక్​ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..

Ayodhya Ram Mandir Free Aarti Pass
Ayodhya Ram Mandir Free Aarti Pass
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 2:53 PM IST

How to Book Ayodhya Ram Mandir Free Aarti Pass By Online and Offline: అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 22 మధ్యాహ్నం 12.30 గంటలకు బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ఇందులో భాగంగా.. జనవరి 16 నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే భక్తులు శ్రీరాముడికి సేవ చేసుకునేందుకు.. అయోధ్య రామాలయ ట్రస్టు అవకాశం అందించింది. రామాలయంలో నిర్వహించే "హారతి" కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉచితంగా పాసులను అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్​తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ ఈ పాసులు పొందవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం..

అయోధ్య రామ మందిరం ఓపెనింగ్​కు 1000 ప్రత్యేక​ రైళ్లు- ఎప్పట్నుంచంటే?

ఆలయంలో మూడు రకాల హారతులు నిర్వహిస్తారు. అవి.. శృంగార హారతి, భోగ హారతి, సంధ్యా హారతి.

  • శృంగార హారతి: ఇది ఉదయం హారతి. ఇక్కడ భగవంతుడు రామ్ లల్లాను దుస్తులు, ఆభరణాలతో అలంకరిస్తారు. ఇది ఉదయం 6:30కి ప్రారంభమవుతుంది.
  • భోగ హారతి: ఇది మధ్యాహ్నం హారతి. ఇక్కడ లార్డ్ రామ్ లల్లాకు ఆహారం, స్వీట్లు అందిస్తారు. ఇది మధ్యాహ్నం 12:00కి ప్రారంభమవుతుంది.
  • సంధ్యా హారతి: ఇది సాయంత్రం హారతి. ఇక్కడ బాల రాముడిని నిద్రించడానికి సిద్ధం చేస్తారు. ఇది రాత్రి 7:30కి ప్రారంభమవుతుంది.

గ్రౌండ్​ ఫ్లోర్​లో బాల 'రాముడు'- అయోధ్యలో శబరికి ప్రత్యేక ఆలయం, దర్శనానికి కోటి మంది భక్తులు!

హారతి పాస్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలంటే..?

  • శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం అఫీషియల్ వెబ్‌సైట్‌ https://srjbtkshetra.org/ విజిట్ చేయాలి.
  • హోమ్​పేజీలో స్క్రీన్​ మీద కనిపించే Click to Contribute ఆప్షన్​పై క్లిక్​ చేస్తే.. కొత్త పేజీ ఓపెన్​ అవుతుంది.
  • ఇప్పుడు Home ఆప్షన్​పై క్లిక్​ చేసి.. మొబైల్ నెంబర్​కు వచ్చే OTP ఉపయోగించి లాగిన్ కావాలి.
  • హోమ్‌పేజీలోనే ‘హారతి(Aarti)’ సెక్షన్‌పై క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత హాజరు కావాలనుకుంటున్న హారతి తేదీ, రకాన్ని ఎంచుకోవాలి.
  • తర్వాత పేరు, చిరునామా, ఫొటో మొదలైన వివరాలను నమోదు చేయాలి.
  • చివరగా పాస్‌ను ప్రింట్ చేసుకోవాలి లేదా డివైజ్‌లో సేవ్ చేయాలి.

8 Feet Gold Throne For Ayodhya Ram Mandir : అయోధ్య రాముడికి 8 అడుగుల బంగారు సింహాసనం.. 'అక్షత పూజ' కోసం 100 క్వింటాళ్ల బియ్యం

హారతి పాస్ కోసం ఆఫ్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలంటే.. : హారతి పాస్‌ను ఆఫ్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అయోధ్య, దిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతాలోని ఏ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర కార్యాలయాన్నైనా సందర్శించవచ్చు. పాస్ పొందడానికి ID ప్రూఫ్ చూపించాలి. అలాగే నామమాత్రపు ఫీజు చెల్లించాలి.

ఏ పత్రాలు అవసరం?:

  • ఆలయంలోకి ప్రవేశించడానికి ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటి డాక్యుమెంట్స్‌లలో ఏదో ఒక దానిని తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
  • డాక్యుమెంట్.. పాస్ బుకింగ్ కోసం ఉపయోగించిన దానితో మ్యాచ్ అవ్వాలి.
  • హారతి కార్యక్రమానికి హాజరయ్యే ముందు కౌంటర్‌లో పాస్‌ను కూడా చూపించాలి.

10 కేజీల వెండితో అయోధ్య రామ మందిరం ప్రతిమలు.. ఎంత చక్కగా ఉన్నాయో!

భక్తులకు ఇతర సూచనలు:

  • ఆలయ వెబ్​సైట్​ ప్రకారం.. 10 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు హారతి కోసం ప్రత్యేక పాస్ అవసరం లేదు. వారు తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో రావచ్చు.
  • వీల్ చైర్ అసిస్టెంట్ సర్వీస్ కావాలంటే.. నామమాత్రపు ఛార్జీ చెల్లించి ఆ సర్వీస్ పొందొచ్చు.
  • హాజరును నిర్ధారించడానికి హారతికి 24 గంటల ముందు SMS లేదా ఈ-మెయిల్ రిమైండర్‌ వస్తుంది.
  • కొవిడ్-19 మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ ఆలయ ప్రాంగణంలో భౌతిక దూరాన్ని మెయింటెయిన్ చేయాలి.

అయోధ్య రామాలయానికి స్పెషల్ డిజైన్- ఏటా ఆ రోజు గర్భగుడిలో అద్భుతం!

ఎన్నడూ చెదరని సోదరభావమే రక్షాకవచం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.