ETV Bharat / bharat

How to Apply for Rythu Bandhu : 'రైతుబంధు'కు ఎలా దరఖాస్తు చేయాలి..? డబ్బులు పడ్డాయో లేదో ఎలా తెలుసుకోవాలి? - రైతుబంధు అర్హులు

Rythu Bandhu Scheme in Telangana : కష్టాన్నే నమ్ముకొని పనిచేస్తున్న రైతన్నకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చింది. పంట పెట్టుబడి సాయం ఎకరానికి ఖరీఫ్, రబీ సీజన్​లో కలిపి ఏటా ఎకరానికి రూ.10 వేలు అందిస్తూ ఆర్థికంగా ఆదుకుంటుంది. ఇటీవల పోడు భూముదారులు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. ఇటీవల 11వ విడుత రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ క్రమంలో కొత్తవారు ఎలా రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి.. ఆన్​లైన్​లో అర్హుల జాబితా, ఖాతాలో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం...

Rythu Bandhu Scheme in Telangana
Rythu Bandhu
author img

By

Published : Aug 17, 2023, 6:25 PM IST

Updated : Aug 18, 2023, 9:39 AM IST

Rythu Bandhu Scheme in Telangana : తెలంగాణ సర్కారు అన్నదాతలకు అండగా నిలిచేందుకు 'రైతు బంధు' అనే సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వ్యవసాయం కోసం పెట్టుబడిని బుుణంగా నగదు రూపంలో రైతన్నకు అందించి ఆర్థికంగా తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఫిబ్రవరి 25న 'రైతు బంధు'(Rythu Bandhu) పథకాన్ని ప్రకటించారు. తాను ఎంతగానో అభిమానించే ఈ పథకాన్ని సీఎం కేసీఆర్.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి వద్ద 2018, మే 10న ప్రారంభించారు.

Telangana Rythu Bandhu Scheme : తొలుత ఈ పథకం ద్వారా ఎకరానికి ఖరీఫ్​లో రూ. 4వేలు, రబీలో రూ.4 వేల చొప్పున ఏడాదికి 8 వేల రూపాయలను ప్రభుత్వం అందించింది. తరువాత ఈ పంట పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ. 5వేలకు పెంచి.. ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో సర్కార్ జమ చేస్తుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి రైతు పెట్టుబడి సాయం పథకమని తెలంగాణ సర్కార్ చెబుతోంది.

Rythu Bandhu Funds 2023 : తాజాగా జూన్ 2023లో 11వ రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 11విడుతల్లో ఈ పథకం ద్వారా రూ.72,910 కోట్ల ఆర్థిక సాయం సర్కార్ రైతులకు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ దఫా కొత్తగా ఐదు లక్షల మంది అన్నదాతలకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. రాష్ట్రంలో సుమారు 70లక్షల మందికి వానాకాలం సీజన్​కుగానూ ఇటీవల విడుదల చేసిన 11వ విడుత రైతుబంధు నిధులు జమకానున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నగదు అర్హులైన ఆయా రైతుల ఖాతాలో దశల వారీగా డిపాజిట్ కానుంది.

Telangana Rythu Bandhu Funds 2023 : రైతుబంధు నిధుల విడుదల​.. రైతుల ఖాతాల్లో జమ

తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న ఈ 'రైతు బంధు' పథకానికి అర్హులుగా ఈ ఏడాది పోడు భూముల పట్టాలు పొందినవారిని అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో రైతుబంధు పథకం అందని రైతులు, కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు, కొత్తగా పోడు పట్టాలు పొందిన రైతులు(Podu Lands Patta Distribution in Telangana) ఈ పథకం పరిధిలోకి రావాలంటే మొదట దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి నూతన లబ్ధిదారులు దరఖాస్తు సమయంలో ఏయే ఏయే పత్రాలు సమర్పించాలి, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

దరఖాస్తు సమయంలో కావాల్సిన పత్రాలు :

1. రైతుబంధు దరఖాస్తు ఫారం

2. దరఖాస్తుదారుని పాస్​బుక్

3. ఆధార్ కార్డు

4. ఓటరు గుర్తింపు కార్డు

5. బ్యాంక్ అకౌంట్ వివరాలు

రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకునే విధానం : పైన పేర్కొన్న పత్రాలతో కొత్తగా దరఖాస్తు చేసుకునే లబ్ధిదారుడు మొదట సంబంధింత గ్రామ వ్యవసాయ అధికారిని గానీ, మండల రెవెన్యూ అధికారిని గానీ సంప్రదించి దరఖాస్తు(How to Apply Rythu Bandhu Scheme in Telugu) సమర్పించాలి. అప్పుడు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. తాజాగా 11వ విడుత ఎంపికైన లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే మీరు ఆ జాబితాలో ఉన్నారో లేదో.. ఒకవేళ ఉంటే అనంతరం మీ రైతు బంధు పేమెంట్ స్టేటస్ ఏ విధంగా ఆన్​లైన్​లో సింపుల్​గా ఇలా తెలుసుకోండి.

Rythu Bandhu scheme: రైతుల అకౌంట్‌లో డబ్బులు పడ్డాయ్‌..

మీరు రైతుబంధు అర్హుల జాబితాలో ఉన్నారో లేదో తెలుసుకోండిలా..

1. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతుబంధు అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నదో లేదో తెలుసుకునేందుకు.. మొదట మీరు అధికారిక వెబ్ సైట్​లోకి వెళ్లాలి.

2. తదుపరి అక్కడ హోం పేజీలో ఉన్న రైతుబంధు స్కీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

3. అప్పుడు ఓపెన్ అయ్యే పేజీలో చెక్ డిస్ట్రిబ్యూషన్ షెడ్యూల్ మీద క్లిక్ చేయాలి.

4. అనంతరం వచ్చే పేజీలో మీ జిల్లా, మండలం సెలక్ట్ చేసుకోవాలి.

5. అప్పుడు మీకు లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో అక్కడ చెక్ చేసుకోవాలి.

అర్హులైన లబ్ధిదారులారా మీ రైతుబంధు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండిలా..

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విడుదల చేసిన 11వ విడుత రైతు బంధు నగదు మీ ఖాతాలో జమ అయ్యిందో లేదో(How to Check Rythu Bandhu Payment Status) తెలుసుకోవడానికి క్రింద పేర్కొన్న ఈ దశలను అనుసరించండి.

1. ఎవరైతే లబ్ధిదారుడు నగదు పేమెంట్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో మొదట తెలంగాణ ట్రెజరీ అధికారిక వెబ్ సైట్​కు వెళ్లాలి.

2. అక్కడ హోం పేజీ మెనూ బార్‌లో రైతుబంధు స్కీమ్ ఖరీఫ్ డీటైల్స్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

3. ఆ తదుపరి మీరు రైతుబంధు అందుకునే సంవత్సరాన్ని టైప్ చేసి.. పీపీబీ నెంబర్ సెలక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలి.

4. ఆ తర్వాత స్కీమ్ వైజ్ రిపోర్ట్ ఎంచుకుని మీ వివరాలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

5. అక్కడ అడిగిన వివరాలన్నీ నమోదు చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.

6. అంతే ఇక మీకు రైతు బంధు నగదు వచ్చిందో లేదో ఇట్టే తెలిసిపోతుంది.

ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని నిలిపేసింది. గతంలో మాత్రం పైన పేర్కొన్న విధానంలో రైతుబంధు నగదు జమ అయ్యాయో లేదో సింపుల్​గా తెలిసిపోయేది. కానీ ప్రస్తుతం మీ ఖాతాలో రైతుబంధు డబ్బులు(Rythu Bandhu 2023 Funds) మీ ఖాతాలో పడ్డాయో లేదో తెలుసుకోవడానికి మీ బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఖాతాలో పడినా చేతిలోకి రాని రైతుబంధు సొమ్ము ఆ చిక్కుముడి వీడేదెలా

Harish Rao Tweet about Rythu Bandu : రూ.10 వేలు.. 10 విడతలు.. రూ.65వేల కోట్లు

Last Updated : Aug 18, 2023, 9:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.