ETV Bharat / bharat

How to Apply For Double Bedroom Scheme : తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్.. దరఖాస్తు ఎలా చేయాలో తెలుసా? - డబుల్ బెడ్ రూమ్ పథకానికి ఏ డాక్యుమెంట్లు కావాలి

Application For 2BHK in Telangana : తెలంగాణలో అల్పాదాయ వర్గాలకు పక్కా ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో.. రాష్ట్ర ప్రభుత్వం 2BHK హౌసింగ్ స్కీం ప్రవేశపెట్టింది. మరి, ఈ పథకం దక్కాలంటే.. ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎలా దరఖాస్తు చేయాలి? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

2BHK Application Status in Telangana
How to Apply For Dobule Bedroom Scheme
author img

By

Published : Aug 13, 2023, 4:38 PM IST

2BHK Application Status in Telangana : ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం 2015 అక్టోబరులో రెండు పడక గదుల పథకాన్ని రాష్ట్ర సర్కారు ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా నిర్మించే ఇంటిలో.. రెండు బెడ్‌రూమ్‌లు, ఒక లివింగ్ రూమ్, ఇంకా.. ఒక వంటగది, రెండు బాత్‌రూమ్‌లు ఉంటాయి. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు మీసేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు ఏంటి..?

Eligibility for Double Bedroom Scheme :

  • డబుల్ బెడ్ రూమ్ కు దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు పలు నిబంధనలు ఉన్నాయి.
  • లబ్ధిదారుడు రేషన్ కార్డు / ఆహార భద్రత కార్డు కలిగి ఉండాలి.
  • ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన వారై ఉండాలి.
  • సొంత ఇల్లు లేని, అద్దె ఇంట్లో నివసిస్తున్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు.
  • శారీరక వికలాంగులకు 5% రిజర్వేషన్ కేటాయించారు.
  • గ్రామీణ ప్రాంతాల్లో.. SC, STలకు 50%.. ఇతరులకు 43%.. మైనారిటీలకు 7% కేటాయించారు.
  • పట్టణ ప్రాంతాల్లో.. ఎస్సీలకు 17%, ఎస్టీలకు 6%, మైనార్టీలకు 12%, ఇతరులకు 65% కేటాయించారు.
  • కుటుంబంలోని సభ్యులెవరికీ ఇందిరా పథకం వంటి హౌసింగ్ స్కీమ్‌ల కింద ఇల్లు పొంది ఉండకూడదు.

దరఖాస్తు దారుకు అవసరమైన పత్రాలు..

Required Documents For 2BHK Application :

  • డబుల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకే వారు ఆధార్ కార్డు సిద్ధం చేసుకోవాలి.
  • రేషన్ కార్డు జిరాక్సు ఉండాలి.
  • ఆసరా పెన్షన్ కార్డు ఉన్నవారి ఆ జిరాక్సు తీసుకోవాలి.
  • నివాస ధ్రువీకరణ పత్రం ఉండాలి.
  • ఒక పాస్‌ పోర్ట్ సైజు ఫొటో

KTR on Double Bedroom Houses : 'ఆగస్టు మొదటివారం నుంచి రెండుపడక గదుల ఇళ్ల పంపిణీ'

ఆన్ లైన్ లో సొంతంగా దరఖాస్తు..

How to Apply for 2BHK in Online :

  • ఆన్‌లైన్‌లో డబుల్ ఇంటి కోసం సొంతంగా దరఖాస్తు చేయాలంటే.. ముందుగా మీ సమీప గ్రామసభ లేదంటే.. మీసేవా కేంద్రాన్ని సందర్శించాలి.
  • అక్కడ ఆపరేటర్ ను సంప్రదిస్తే.. దరఖాస్తు ఫారమ్ ఇస్తారు. లేదంటే.. మీ ఫోన్ కు ఒక లింక్ పంపిస్తారు. దాన్నుంచి ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
  • ఆ తర్వాత.. ఆ ఫామ్ ను పూర్తి వివరాలతో ఫిల్ చేయాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు ఫామ్ నింపిన తర్వాత.. ఇతర ధ్రువీకరణ పత్రాలు జత చేసి.. సమీపంలోని గ్రామసభ లేదా మీసేవా కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించిన తర్వాత.. మీరు సబ్మిట్ చేసినట్టుగా ఓ రిఫరెన్స్ ఇస్తారు. దాన్ని భద్రంగా దాచుకోవాలి.

లబ్ధిదారుల ఎంపిక విధానం..

Beneficiary Selection Process :

  • జిల్లా స్థాయి కమిటీ ద్వారా ఈ డబుల్ పథకం లబ్ధిదారుల ఎంపిక సాగుతుంది.
  • ముందుగా.. దరఖాస్తుదారు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీసేవా కేంద్రం లేదా గ్రామసభ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఈ దరఖాస్తును పరిశీలించి, అభ్యర్థి అర్హుడా? కాదా ? అన్నది తహసీల్దార్‌ తేలుస్తారు. అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను జిల్లా మేజిస్ట్రేట్‌కు పంపిస్తారు.
  • అనంతరం గ్రామసభలో.. లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటిస్తారు. ఆమోదం పొందిన ఆ జాబితాను.. ప్రజలకోసం ప్రదర్శిస్తారు.
  • ఫిర్యాదులు ఏమైనా వస్తే.. జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన అధికారి ఫిర్యాదులను పరిష్కరిస్తారు. ఫిర్యాదులు అప్పీలేట్ కమిటీకి సమర్పించబడతాయి. దాని నిర్ణయమే ఫైనల్.

TS High court :'డబుల్' ఇళ్ల కేటాయింపులో వాళ్లకు కూడా కేటాయించండి

డబుల్ బెడ్ రూమ్ డిజైన్ ఎలా ఉంటుంది..?

design of a Telangana double bedroom :

డబుల్ బెడ్ రూమ్ పథకంలోని ప్రతి ఇల్లూ.. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇంటిలో రెండు పడక గదులు, ఒక హాలు, వంటగది ఉంటాయి. ఇంకా.. రెండు బాత్‌రూమ్‌లు. ఒక టాయిలెట్‌ ఉంటుంది. ప్రతి ఇంట్లో ఫర్నిచర్ తోపాటు ఇతర వస్తువులను నిల్వ చేయడానికి రెండు లాఫ్ట్‌లు ఉంటాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అనుకూలతను బట్టి.. డాబా మీదకు మెట్లు బయటగానీ.. లోపల గానీ ఉంటాయి.

దరఖాస్తు స్థితిని ఎలా ట్రాక్ చేయాలి?

How to Track Application Status :

  • మీ దరఖాస్తు ఏ స్థితిలో ఉంది? మీకు ఇల్లు మంజూరైందా? లేదా? అనేది ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు.
  • ఇందుకోసం.. తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
  • ఇక్కడ మీకు ఇచ్చిన రిఫరెన్స్ ఐడీని నమోదు చేయాలి.
  • ఆ తర్వాత మీ జిల్లా, మండలం, గ్రామం వంటి సమాచారం అడుగుతుంది. అన్నీ కాలాలనూ ఫిల్ చేసిన తర్వాత "GO" అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.