విడాకులు తీసుకున్న స్వాతంత్ర్య సమరయోధుల కూతుళ్లకు ఎంత ఆర్థిక సాయం అందిస్తున్నారో తెలపాలని కేంద్రాన్ని కోరింది సుప్రీం కోర్టు. పెళ్లికాని, వితంతువుల కుమార్తెలతో పాటు విడాకులు తీసుకున్న స్వాతంత్ర్య సమరయోధుల కుమార్తెలకు కుటుంబ పింఛను ఇచ్చేందుకు కోర్టు అనుమతిస్తే.. అది ఎంత వరకు ఆర్థిక భరోసా కల్పిస్తుందో చెప్పాలని జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం కోరింది.
హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన తుల్సీ దేవి(57) వేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ మేరకు వివరాలు కోరింది. ఈ కేసుపై ఆమె తొలుత హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా ఆమె తరఫున దుష్యంత్ పరాషర్ అనే న్యాయవాది వాదిస్తూ.. విడాకులు తీసుకున్న స్వాతంత్ర్య సమరయోధుల కుమార్తెను వితంతువు లేదా అవివాహితతో సమానంగా చూడాలన్నారు. బాధితురాలి తండ్రి దేశం కోసం పోరాడి ప్రాణాలర్పించారన్న ఆయన.. ఆ తర్వాత సదరు కుటుంబానికి ఆదాయ వనరులు కరవయ్యాయని పేర్కొన్నారు. ఫలితంగా రక్షణ శాఖ 2012 డిసెంబర్ 14న విడుదల చేసిన గెజిట్ ఆధారంగా బాధితురాలికి ప్రయోజనం చేకూర్చాలని కోరారు.
ఇదీ చదవండి: దీదీ.. మీరు మారిపోయారు, ముందులా లేరు: మోదీ