ETV Bharat / bharat

టీకా అనుమతులు వచ్చేశాయ్​.. పంపిణీ ఎలా?

author img

By

Published : Jan 3, 2021, 3:59 PM IST

కరోనా మహమ్మారిపై పోరాటంలో దివ్యాస్త్రంగా భావిస్తున్న వ్యాక్సిన్​ వచ్చేసింది. భారత్​లో.. కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకాల అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) పచ్చజెండా ఊపింది. అయితే.. ఎవరెవరికి టీకాను అందిస్తారు? అసలీ వ్యాక్సినేషన్​ ప్రక్రియ ఎలా సాగుతుంది.. వంటి ప్రశ్నలకు సమాధానాల్ని ఈ కథనంలో తెలుసుకుందాం.

how covid vaccination process will goes in india
ఇంతకీ.. కొవిషీల్డ్​ టీకా వేస్తారా? కొవాగ్జినా?

దేశంలో కొవిడ్​ మహమ్మారిని తుదముట్టించేందుకు రంగం సిద్ధమైంది. కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకాలకు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) ఆదివారం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్​​ ప్రక్రియ ఎలా సాగుతుందో ఇప్పుడు చూద్దాం.

ఎవరెవరికి వ్యాక్సిన్​ ఇస్తారు?

కొవిడ్ టీకాను తొలుత ఆరోగ్య పరిరక్షణ సిబ్బందికి, 50 ఏళ్లు వయస్సు పైబడిన వారికి వేస్తారు. ప్రాధాన్య క్రమంలో.. ఆ తర్వాత టీకా లభ్యతను బట్టి మిగతా జనాభాకు వ్యాక్సిన్ అందిస్తారు. అయితే వీరందరూ తొలుత.. డిజిటల్​ వేదిక కొవిడ్​ వ్యాక్సిన్​ ఇంటెలిజెన్స్​ నెట్​వర్క్​ (కో-విన్​)లో తప్పక నమోదు చేసుకోవాలి.

ఎప్పుడు టీకా వేస్తారు?

వారాల వ్యవధిలోనే టీకాలను విడుదల చేయటానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ను భారత్​లో రూపొందించిన సీరం ఇన్​స్టిట్యూట్​ సంస్థ ప్రకటించింది. డీసీజీఐ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో.. కొవాగ్జిన్​ టీకాను రూపొందించిన భారత్​ బయోటెక్​ కూడా త్వరలోనే తమ టీకాను విడుదల చేస్తామని తెలిపింది.

వ్యాక్సిన్​కు డబ్బులు చెల్లించాలా?

దేశవ్యాప్తంగా తొలిదశలో మూడు కోట్ల మంది కరోనా యోధులకు టీకా ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 50 ఏళ్లకు పైబడిన 27 కోట్ల మంది ప్రాధాన్య లబ్ధిదారులకు ఏ విధంగా టీకా అందించాలన్నదానిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని తెలిపింది.

ఎన్ని టీకాలు సిద్ధంగా ఉన్నాయి?

దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే పది కోట్ల డోసులను సిద్ధం చేసినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. తమ వద్ద 4 నుంచి 5 కోట్ల డోసుల కొవిషీల్డ్ టీకాలు నిల్వ ఉన్నట్లు సీరం సంస్థ గతంలోనే ప్రకటించింది.

ఈ టీకాలు సురక్షితమేనా?

రెండు దశల మానవ ప్రయోగాల్లో ఉత్తమ ఫలితాలు ఇవ్వటం సహా.. మూడో దశ క్లినికల్ ట్రయల్స్​లో పాల్గొన్న వారికి సంబంధించిన సమాచారాన్ని పరిశీలించిన అనంతరం భారత్ బయోటెక్​ సంస్థ రూపొందించిన కొవాగ్జిన్​కు డీసీజీఐ అత్యవసర వినియోగ అనుమతులను జారీ చేసింది.

కొవిషీల్డ్​ టీకా ట్రయల్స్​లో దుష్ప్రభావాలేవీ కనిపించలేదు. కానీ, వలంటీర్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల ఫేజ్ 3 ట్రయల్స్​ను రెండు సార్లు ఆపేయాల్సి వచ్చింది. అయితే టీకా వల్ల తీవ్రమైన ఇబ్బందులేవీ ఎదురుకాలేదని ఆక్స్​ఫర్డ్ ప్రకటించింది. ఈ రెండు వ్యాక్సిన్లూ వంద శాతం సురక్షితమని డీసీజీఐ పేర్కొంది.

టీకాను ఎలా భద్రపరుస్తారు?

వ్యాక్సిన్​ క్యారియర్లు, నిల్వ చేసే బాక్సులు, ఐస్​ ప్యాక్​లు నేరుగా సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. లబ్ధిదారుడు టీకా తీసుకునేందుకు కేంద్రానికి వచ్చే వరకు వ్యాక్సిన్​ను క్యారియర్​ లోపలే భద్రపరుస్తారు. టీకా పంపిణీ ముగిసిన తర్వాత అన్ని ఐస్​ ప్యాక్​లు, తెరవని వ్యాక్సిన్​ బాక్సులను తిరిగి కోల్డ్​ చైన్​ పాయింట్​కు పంపిస్తారు.

ఎన్ని డోసులు తీసుకోవాలి?

డీసీజీఐ ప్రకారం కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌లను రెండు డోసుల చొప్పున తీసుకోవాలి. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది.

కొవిషీల్డ్​ ​ వేస్తారా? కొవాగ్జిన్​ వేస్తారా?

వివిధ రకాల వ్యాక్సిన్లతో గందరగోళం ఏర్పడకుండా నివారించేందుకు ఒక జిల్లాకు ఒకే సంస్థ టీకాను కేటాయించాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో సూచించింది. దానికి అనుగుణంగానే.. వ్యాక్సినేషన్​ కోసం ఈ రెండింటిలో ఏదో ఒక టీకాను కేటాయిస్తారు.

టీకా తీసుకున్న తర్వాత ప్రతికూలతలు ఎదురైతే ఏం చేస్తారు?

లబ్ధిదారులకు వ్యాక్సిన్​ ఇచ్చేముందే.. టీకా వల్ల తలెత్తే సమస్యల గురించి వివరిస్తారు. వారు అంగీకరిస్తేనే వ్యాక్సినేషన్​ ప్రక్రియ మొదలుపెడతారు. టీకా​ తీసుకున్న తర్వాత ఏమైనా ప్రతికూల ప్రభావం ఉందా అని తెలుసుకునేందుకు 30 నిమిషాల పాటు పరిశీలనలో ఉంచుతారు. తీవ్ర ప్రతికూలతలు ఎదురైతే.. వారిని ఆసుపత్రిలోని క్యాజువాలిటీ వార్డుకు తరలిస్తారు.

ఇదీ చూడండి:కొవిడ్‌ టీకాతో ఇమ్యూనిటీ ఎప్పుడు వస్తుందంటే..

ఇదీ చూడండి: టీకాపై సందేహాలా? ఇవిగో సమాధానాలు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.