ETV Bharat / bharat

ఇంటి నుంచి వింత శబ్దాలు.. సైంటిస్టులంతా వచ్చి చూస్తే..

కోజికోడ్​లోని ఓ ఇంట్లో ఉన్నట్లుండి విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయి . ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఎందుకు వస్తున్నాయో ఆ ఇంటి ఓనర్లకు అంతుపట్టడం లేదు. ఈ శబ్దాలకు గల కారణం తెలుసుకునేందుకు ఏకంగా రాష్ట్ర మంత్రి, శాస్త్రవేత్తలు రంగంలోకి దిగడం స్థానికంగా సంచలనంగా మారింది.

kerala latest news
ఇంటి నుంచి వింత శబ్దాలు
author img

By

Published : Sep 30, 2021, 1:05 PM IST

కోజికోడ్​లోని ఈ ఇంట్లో గత కొన్ని రోజులుగా వింత శబ్దాలు మారుమోగుతున్నాయి

కేరళలోని కోజికోడ్​లో ఉన్న ఈ ఇంట్లో బిజు అతని కుటుంబంతో గత ఐదేళ్లుగా నివాసం ఉంటున్నారు. ఇన్నిరోజులు ప్రశాంతంగా ఉన్న ఆ ఇంట్లో ఇప్పుడు ఉన్నట్టుండి వింత శబ్దాలు మొదలయ్యాయి. నేలలో సుత్తితో కొడుతున్నట్లు, ఇలా విచిత్రమైన శబ్దాలు బిజు ఇంట్లో ప్రతిధ్వనిస్తున్నాయి. అసలు ఆ శబ్దాలు ఎందుకు, ఎలా వస్తున్నాయో అక్కడి వారికి అంతుచిక్కడం లేదు.

బిజు ఇంట్లో ఈ గందరగోళం మొదలై సుమారు రెండు వారాలకు పైనే అవుతోంది. పగలూ రాత్రి అనే తేడా లేకుండా శబ్దాలు మారుమోగుతున్నాయి. నిశ్శబ్దంగా ఉన్న తమ ఇంట్లో ఇలా జరుగుతుండటం వల్ల ఇంట్లోని వారు కంగారు పడ్డారు. అసలు అవి ఎందుకు వస్తున్నాయో.. ఎక్కడ నుంచి వస్తున్నాయో అంతుచిక్కడం లేదు. ఇల్లంతా వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో బిజు, ఈ సమస్య పరిష్కారం కోసం మంత్రి ఏకే సశీంద్రన్​ను మంగళవారం కలిశారు. బిజు ఇంటిని పరిశీలించిన మంత్రి, సమస్య పరిష్కారం కోసం తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. మంత్రి ఆదేశాల మేరకు భూగర్భ శాస్త్రవేత్తలు బుధవారం.. బిజు ఇంటికి వచ్చి పరీక్షించారు. పూర్తి పరిశోధన తర్వాతే.. అసలు విషయం బయటపడే అవకాశముంది.

ఇటీవల ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ ఎత్తున భూమిని చదును చేసే పనులు జరిగాయని.. ఈ విచిత్రమైన శబ్దాల వెనుక అదే కారణమై ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చూడండి : రైతుల కోసం విద్యార్థుల ఆవిష్కరణ- జాతీయ అవార్డు దాసోహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.